రూ.10 లక్షల డిమాండ్‌.. ఏసీబీ వలలో శామీర్‌పేట తహసీల్దార్‌

13 Feb, 2024 15:48 IST|Sakshi

సాక్షి, మేడ్చల్: మేడ్చల్‌ మల్కాజీగిరి జిల్లా శామీర్‌పేట  తహసీల్దార్‌  అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) వలకు చిక్కారు. రూ.10 లక్షలు లంచం తీసుకుంటూ మంగళవారం తహసీల్దార్‌ సత్యనారాయణ ఏబీసీ అధికారులకు పట్టుబడ్డారు. ఓ వ్యక్తికి సంబంధిచిన భూమికి పట్టాదారు పాసుబుక్‌ జారీ చేసేందుకు సదరు తహసీల్దార్‌ రూ.10 లక్ష లంచం డిమాండ్‌ చేసినట్లు తెలుస్తోంది.

దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించగా.. పక్కా ప్రణాళికతో సత్యనారాయణ డ్రైవర్ డబ్బులు తీసుకునే క్రమంలో రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులు అతన్ని పట్టుకున్నారు. అయితే తహసీల్దార్‌ సత్యనారాయణ తీసుకోమని చెబితేనే తాను లంచం డబ్బు తీసుకున్నానని డ్రైవర్‌ తెలిపారు. దీంతో ఏసీబీ అధికారులు.. తహసీల్దార్‌ సత్యనారాయణను అదుపులోకి తీసుకున్నారు.

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega