పేపర్‌లెస్‌ ఈ–బోర్డింగ్‌.. క్యూ మేనేజ్‌మెంట్‌

24 Jun, 2021 08:38 IST|Sakshi

శంషాబాద్‌ విమానాశ్రయంలో సురక్షిత ప్రయాణానికి ఏర్పాట్లు 

దేశంలోనే ఈ–బోర్డింగ్‌ సదుపాయం ఉన్న ఏకైక ఎయిర్‌పోర్ట్‌

దేశీయ ప్రయాణంలో నిబంధనల సడలింపుతో ఊపందుకోనున్న విమానయానం  

శంషాబాద్‌: దేశవ్యాప్తంగా కోవిడ్‌ తగ్గుముఖం పడుతున్న వేళ సురక్షితమైన విమానయానానికి శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉంది. ఆయా రాష్ట్రాలు దేశీయ ప్రయాణంలో నిబంధనలను సడలించడంతో మళ్లీ విమానయానం ఊపందుకునే అవకాశం ఉంది. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలను కల్పించినట్లు విమానాశ్రయ వర్గాలు వెల్లడించాయి.  

విమానాశ్రయంలోని విశేషాలివీ
►కాంటాక్ట్‌లెస్‌ బోర్డింగ్‌లో భాగంగా చెక్‌–ఇన్‌ హాల్స్‌ వద్ద సెల్ఫ్‌ కియోస్కులను ఏర్పాటు చేశారు. క్యూఆర్‌ కోడ్‌ ద్వారా ఇక్కడ చెక్‌–ఇన్‌ ప్రక్రియ పూర్తవుతుంది. 
►శంషాబాద్‌ విమానాశ్రయంలో సురక్షిత ప్రయాణానికి ఏర్పాట్లు.
►దేశంలోనే ఈ–బోర్డింగ్‌ సదుపాయం ఉన్న ఏకైక ఎయిర్‌పోర్ట్‌.
►దేశీయ ప్రయాణంలో నిబంధనల సడలింపుతో ఊపందుకోనున్న విమానయానం  పేపర్‌లెస్‌ ఈ–బోర్డింగ్‌ సౌకర్యం ఉన్న దేశంలోని ఏకైక విమానాశ్రయంగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు గుర్తింపు సాధించింది.  
►దేశీయ ప్రయాణంలో పూర్తి ఈ–బోర్డింగ్‌ సౌకర్యాన్ని కల్పించగా, అంతర్జాతీయంగా ఎయిరిండియా, ఇండిగో, విస్తారా, స్పైస్‌జెట్, ఎమిరేట్స్, గో ఎయిర్‌లైన్స్‌ సంస్థలు ఈ–బోర్డింగ్‌ సదుపాయాన్ని వినియోగంలోకి తెచ్చాయి.  
►ఇటీవల పైలట్‌ ప్రాజెక్టుగా క్యూ మేనేజ్‌మెంట్‌ విధానాన్ని కూడా అందుబాటులోకి తెచ్చారు. రద్దీ ప్రాంతాలపై డిస్‌ప్లే బోర్డుల ద్వారా ప్రయాణికులకు సమాచారం అందించేందుకు ఏర్పాట్లు చేశారు. దీంతో ఒకేచోట రద్దీ ఏర్పడకుండా నివారిస్తున్నారు.  
►జీఎంఆర్‌ సంస్థ ఆధ్వర్యంలో ఢిల్లీ, హైదరాబాద్‌ విమానాశ్రయాలు ‘హెచ్‌ఓఐ’ యాప్‌ తో భాగస్వామ్యాన్ని రూపొందించుకున్నాయి. దీంతో కాంటాక్ట్‌లెస్‌ ఫుడ్‌ ఆర్డర్‌లతోపాటు పేమెంట్‌ సౌకర్యాలను మొబైల్‌ ఫోన్‌ల ద్వారా ప్రయాణికులు పొందవచ్చు.  
►భౌతిక దూరం నిబంధనలతోపాటు నిరంతర మాస్క్‌ల వినియోగం పర్యవేక్షణ మైక్‌ల ద్వారా ఎప్పటికప్పుడు నిర్వహిస్తున్నారు. 
►టచ్‌లెస్‌ ఎలివేటర్‌లతోపాటు ఎక్కువగా వినియోగించే ట్రాలీలు, బెల్టులు ఇతర పరికరాలనూ శానిటైజ్‌ చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు