Shamshabad: ప్రధాన టెర్మినల్‌ నుంచే విమాన సర్వీసులు

24 Nov, 2022 15:09 IST|Sakshi

శంషాబాద్‌: దశలవారీగా జరుగుతున్న రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ విస్తరణ పనుల్లో భాగంగా తాత్కాలిక అంతర్జాతీయ డిపార్చర్‌ను మూసివేయనున్నారు. ప్రధాన టెర్మినల్‌ అనుసంధానంగా నిర్మాణం చేసిన విస్తరణ పనులు పూర్తవడంతో ఈ నెల 28 నుంచి గతంలో మాదిరిగానే ప్రధాన టెర్మినల్‌ నుంచే అంతర్జాతీయ డిపార్చర్‌ కేంద్రం కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి.

ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను జీఎంఆర్‌ సంస్థ పూర్తి చేసినట్లు విమానాశ్రయ వర్గాలు బుధవారం మీడియాకు వెల్లడించాయి. (క్లిక్ చేయండి: బేగంపేట మార్గంలో మళ్లీ ట్రాఫిక్‌ ఆంక్షలు..  ఫిబ్రవరి 21 వరకు..)

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు