కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన తొలి వీగన్‌ 

13 Sep, 2021 15:41 IST|Sakshi
వీగనిజంలో భాగంగా రికార్డు సృష్టించిన శారద  

సాక్షి, హైదరాబాద్‌: వ్యక్తిగత స్వార్థాల కోసం సాటి జీవులను హింసించకూడదని, ప్రతి జీవికి స్వేచ్ఛాయుత జీవనాన్ని అందించడం మన బాధ్యతని వినూత్నంగా అవగాహన కల్పిస్తోంది నగరానికి చెందిన వీగన్‌ శారద. అవగాహన కార్యక్రమంలో భాగంగా ఏకంగా ప్రపంచంలో ఎత్తయిన ఏడు శిఖరాల్లో ఒకటైన కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి చరిత్ర సృష్టించింది. ఆఫ్రికన్‌ ఖండంలో అతి ఎత్తయిన 19,340 అడుగుల కిలిమంజారో పర్వత శిఖరాన్ని శారద తన ఐదుగురు బృందంతో కలిసి ఈ నెల 10వ తేదీన చేరుకున్నారు. అంతేగాకుండా కిలిమంజారో అధిరోహించిన తొలి వీగన్‌గా శారద రికార్డు నమోదు చేశారు.

జంతు సంబంధిత పదార్థాలు, వస్తువులను వాడకుండా వాటి స్వేచ్ఛకు భంగం వాటిల్లకుండా పాటుపడే వారిని వీగన్స్‌గా పరిగణిస్తారు. ప్రపంచవ్యాప్తంగా వీగనిజాన్ని ప్రచారం చేసి ప్రజల్లో అవగాహన కల్పించేందుకే తాను ప్రపంచంలో అతి ఎత్తయిన ఈ పర్వతారోహనకు సిద్ధమయ్యానని ఆమె పేర్కొన్నారు. మన నిత్య జీవితంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నో రకాలుగా జీవహింసకు కారణమవుతున్నామని, అందులోని హింస, వేదనకు వ్యతిరేకంగా తాను వీగన్‌గా మారానని తెలిపింది. వీగన్‌గా మారడం క్లిష్టతరం కాదని, దశలవారీగా ప్రయతి్నస్తే అందరూ వీగన్స్‌గా మారవచ్చని, అందకు తానే నిదర్శనం అన్నారు.
చదవండి: దేశ దిమ్మరిలాగా తిరక్కూడదు.. ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లాడాలని..

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు