పర్యాటకులకు గుడ్‌న్యూస్‌..

26 Sep, 2020 17:05 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైటెక్‌ సిటీ చెంత పల్లె అందాలతో కనువిందు చేసే శిల్పారామం అక్టోబర్‌ 2 నుంచి తెరుచుకోనుంది. కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ కారణంగా మూసివేసిన శిల్పారామం తిరిగి సందర్శకులకు అందుబాటులోకి రానుంది. మ‌ధ్యాహ్నం 2 గంట‌ల నుంచి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు శిల్పారామం తెరిచి ఉండ‌నుంది. పర్యాటకుల శరీర ఉష్ణోగ్రతలను పరిశీలించిన తరువాతే లోపలికి అధికారులు అనుమతించనున్నారు. కేంద్ర మార్గ‌ద‌ర్శ‌కాల మేర‌కు శ‌నివారం నుంచి అర్బ‌న్ పార్కుల‌ను తెరిచేందుకు ప్ర‌భుత్వం అనుమ‌తిచ్చిన విష‌యం విదిత‌మే. క‌రోనా నిబంధ‌న‌ల‌ను అనుస‌రించి సంద‌ర్శ‌కుల‌కు శానిటైజ‌ర్ల‌ను అందుబాటులో ఉంచాల‌ని, మాస్కులు ధ‌రించిన వారినే లోప‌ల‌కు అనుమ‌తించాల‌ని అధికారుల‌ను ప్ర‌భుత్వం ఆదేశించింది. (చదవండి: వారిని నమ్మొద్దు: మంత్రి కేటీఆర్‌)

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు