భారీగా తగ్గిన ఆయిల్‌ఫాం ధర

2 Oct, 2022 07:58 IST|Sakshi

గెలల ధర టన్నుకు రూ. 3,300 పతనం 

అశ్వరావుపేట: ఆయిల్‌పాం గెలల ధర భారీగా పడిపోయింది. ఈ ఏడాది కాలంలో ఇంత మేర తగ్గడం ఇదే తొలిసారి. దసరా పండుగ సమయాన ధర పడిపోవడం రైతులను తీవ్రనిరాశకు గురిచేసింది. ఆయిల్‌పాం గెలలు టన్ను ధర సెప్టెంబర్‌లో రూ.16,295 ఉండగా, తాజాగా రూ.3,300 మేర తగ్గింది.

దీంతో అక్టోబర్‌లో ధర టన్నుకు రూ.12,995గా ఉందని ఆయిల్‌ఫెడ్‌ ఉన్నతాధికారులు ప్రకటించారు. మూడు నెలలుగా ధర పడిపోతూనే ఉంది. దీంతో ఆయిల్‌పాం సాగు చేస్తున్న రైతుల్లో ఆందోళన మొదలైంది.

చదవండి: పాస్‌పోర్టు కావాలా.. ఇప్పుడంతా ఈజీగా రాదండోయ్‌!

మరిన్ని వార్తలు