స్కూళ్లు తెరిచి రెండు నెలలు.. సర్దుబాటు తలనొప్పులు, పరిష్కారం?

2 Sep, 2022 01:03 IST|Sakshi

5 వేల మంది సబ్జెక్టు టీచర్ల కొరత

ఒక చోటు నుంచి మరో చోటుకు టీచర్లు

ప్రాథమిక విద్య టీచర్లకు ఉన్నత క్లాసులు

విద్యా వలంటీర్ల నియామకం లేక సమస్య మరింత తీవ్రం

సాక్షి, హైదరాబాద్‌: పాఠశాల విద్యలో మళ్ళీ సర్దుబాటు తలనొప్పులు మొదలయ్యాయి. స్కూళ్లు తెరిచి రెండు నెలలు దాటినా సబ్జెక్టు టీచర్ల కొరత కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. దీనిని భర్తీ చేయడానికి ఒక చోటు నుంచి మరో చోటుకు టీచర్లను సర్దుబాటు చేస్తున్నారు. ఫలితంగా అనేక స్కూళ్లలో బోధన కుంటుపడుతోందన్న విమర్శలొస్తు న్నాయి. ఈ సర్దు బాట్లన్నీ జిల్లాల పరిధిలోనే జరుగుతా యని రాష్ట్ర అధికారులు అంటున్నారు.

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే సర్దుబాటు చేయాల్సి వస్తోందని జిల్లాల అధికారులు చెబుతున్నారు. సర్కారీ స్కూళ్లలో ఇంగ్లిష్‌ మీడియం చదువులు మొదలు పెట్టినా, ఈ తరహా సర్దు బాట్లు ఏమిటని విద్యారంగ నిపుణులు ప్రశ్నిస్తు న్నారు. ఉపాధ్యాయుల కొరతే ఈ సమస్యకు కారణ మని అధికారులు అంటున్నారు. టీచర్ల పదోన్నతులు, బదిలీలు చేపడితే తప్ప కొత్త నియామకాలపై స్పష్టత రాదని, అప్పటి వరకూ సర్దు బాట్లు తప్పవని చెపుతున్నారు.

విద్యా వాలంటీర్ల నియామకం లేక..
ఏటా విద్యా వలంటీర్లను తీసుకుని బోధన కార్యక్రమాలు చేపట్టేవాళ్లు. దీనివల్ల సమస్య తీవ్రత కొంత కనిపించేది కాదు. అయితే కరోనా వచ్చినప్పటినుంచి విద్యా వలంటీర్ల నియా మకం చేపట్టడం లేదు. ఫలితంగా సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరత మరింత పెరిగింది. ఇటీవల సేకరించిన వివరాల ప్రకా రం రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 5 వేల మంది సబ్జెక్టు టీచర్ల కొరత ఉంది. సెకండరీ గ్రేడ్‌ టీచర్లతో కలిపి 16,500 మంది టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని గుర్తించారు. అయితే, ఈ సంఖ్య 19 వేల వరకూ ఉంటుందని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. 

ప్రమోషన్లు ఇస్తే పరిష్కారం 
పదోన్నతులు, బదిలీలు చేపట్టకపోవడం వల్ల ఖాళీలను భర్తీ చేయడం లేదు. దీనివల్ల విదావ్యవస్థలో అనేక ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. పలుమార్లు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చాం. విధిలేక పోరాటానికి సిద్ధమయ్యాం. ఇప్పటికైనా సర్దుబాటు కాకుండా, శాశ్వత పరిష్కారం వైపు అడుగులేయాలి.  
– చావా రవి (యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి)

ప్రాథమిక విద్యపైనా ప్రభావం..
రాష్ట్రంలో ఒకటి నుంచి 5వ తరగతి వరకు బోధన విష యంలో ప్రభుత్వం ఇప్పటికీ శ్రద్ధ పెట్టడం లేదని విమ ర్శలు వస్తున్నాయి. ఈ కేటగిరీలో విద్యా ప్రమాణాలు దారుణంగా పడిపోయినట్లు ఇటీవల నివేదికలు స్పష్టం చేశాయి. అయినప్పటికీ ఉపాధ్యాయుల కొరత తీర్చడం అటుంచి, ఉన్న టీచర్లను వేరే ప్రదేశాలకు సర్దుబాటు చేస్తు న్నారనే విమర్శలొస్తున్నాయి. సిద్దిపేట జిల్లాలో ఓ స్కూల్‌ ఉపాధ్యాయుడిని ఉన్నత పాఠశాలకు పంపారు. దీంతో ప్రాథమిక పాఠశాలలో బోధన కుంటుపడింది. ఆసిఫా బాద్‌లో 65 మందిని, నిర్మల్‌లో 110 మందిని, ఆదిలా బాద్‌లో 97 మందిని ఈ విధంగానే సర్దుబాటు చేశారు. 

మరిన్ని వార్తలు