ఎస్‌ఐ సిద్ధయ్య కుటుంబానికి అందని పరిహారం!

31 Aug, 2020 10:53 IST|Sakshi

సాక్షి, ఆత్మకూరు: సిమీ ఉగ్రవాద  కాల్పుల్లో వీరమరణం పొందిన యాదాద్రిభువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలానికి చెందిన ఎస్‌ఐ డి. సిద్ధయ్య కుటుంబానికి ప్రభుత్వం నుంచి రావాల్సిన పరిహారం అందలేదు. దీంతో ఆ పోలీసు అధికారి కుటుంబం ఇబ్బందులు పడుతోంది. మరణించి 5సంవత్సరాలు అవుతున్నా ప్రభుత్వం ప్రకటించిన పరిహారం పూర్తి స్థాయిలో అందలేదు. 4 ఏప్రిల్‌ 2015లో సిమీ ఉగ్రవాదులు సూర్యాపేట నుంచి తçప్పించుకుని, తిరుమలగిరి మీదుగా మోత్కూరు మండలం జానకీపురంలోకి చొరబడ్డారు.

అందులో భాగంగా ఆత్మకూరు(ఎం)కు చెందిన ఎస్‌ఐ డి. సిద్ధయ్యతో పాటు కానిస్టేబుల్‌ నాగరాజు ఉగ్రవాదులకు ఎదురుపడ్డారు. ఇరువురి మధ్య కాల్పులు జరిగాయి. కాల్పుల్లో ఉగ్రవాదులిద్దరూ మరణించారు. అంతేకాకుడా కానిస్టేబుల్‌ నాగరాజు అక్కడికక్కడే మరణించాడు. ఎస్‌ఐ డి. సిద్ధయ్య తీవ్రంగా గాయపడి ఎల్‌బీ నగర్‌ కామినేనిలో చికిత్స పొందుతూ మరణించారు. (తుపాకీతో మాజీ మంత్రి బెదిరింపులు)

పరిహారం అంతంతే..
ఎస్‌ఐ డి. సిద్ధయ్య సిమీ ఉగ్రవాదుల కాల్పుల్లో వీరమరణం పొందడంతో అప్పట్లో ప్రభుత్వం సిద్దయ్య కుటుంబానికి రూ. 40లక్షలతో పాటు ఇంటి స్థలం, సిద్ధయ్య భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రకటించింది. అయితే ప్రభుత్వం ప్రకటించిన వాటిలో సిద్ధయ్య కుటుంబా నికి రూ.40లక్షలు మాత్రమే అందాయి. ఇంటి స్థలం ఇంత వరకు ఇవ్వలేదు. ప్రభుత్వ ఉద్యోగం కల్పించలేదు. ఇంటి స్థలం ఉద్యోగం చేసిన చోట లేదా పుట్టిన గ్రామంలో ఇంటి స్థలం ఇస్తామంటే హైదరాబాద్‌లోనే ఇవ్వాలని సిద్దయ్య భార్య ప్రభుత్వాన్ని కోరితే ప్రభుత్వం ఒప్పుకోవట్లేదని సమాచారం.

సీఎం అపాయింట్‌మెంట్‌ కోసం..
ప్రభుత్వం పరిహారం ప్రకటించి 5సంవత్సరాలు అవుతుంది. రూ. 40లక్షలు మినహా మిగతా హామీలు అమలు కాలేదు. దీంతో తన బాధను చెప్పుకోవడానికి సిద్ధయ్య భార్య ధరణీష సీఎం కేసీఆర్‌ను కలవడానికి ప్రయత్నం చేసింది. అపాయింట్‌మెంట్‌ కోసం ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఇప్పటికైనా తన గోడును సీఎం కేసీఆర్‌ కు వినిపించడానికి అవకాశం ఇవ్వాలని ధరణీష కోరుతోంది.  

కల్నల్‌ సంతోష్‌ బాబు తరహాలో న్యాయం చేయాలి..
చైనా సరిహద్దు గాల్వన్‌ లోయలో వీరమరణం పొందిన కల్నల్‌ సంతోష్‌బాబు కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేసిన విధంగా.. తమకు న్యా యం చేయాలని వీరమర ణం పొందిన సిద్ధ య్య భార్య ధరణీష కోరుతోంది.   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా