ఉగాది సందర్భంగా ఘనంగా లేక్‌ ‌ఫెస్టివల్ .. ఎక్కడంటే!

12 Apr, 2021 12:46 IST|Sakshi
విద్యుత్‌ దీపాలంకరణలో సస్పెన్షన్‌ బ్రిడ్జి

సిద్దిపేటలో లేక్‌ ఫెస్టివల్‌

సాక్షి, సిద్దిపేటజోన్‌: ఉగాది పండుగను పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కోమటిచెరువు (మినీ ట్యాంక్‌బండ్‌)పై నేటి నుంచి ప్రారంభించనున్న లేక్‌ ఫెస్టివల్‌ (కోమటి చెరువు మహోత్సవం)కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 12 నుంచి 14 వరకు మున్సిపల్, పర్యాటకశాఖ, నీటిపారుదలశాఖ ఆధ్వర్యంలో ఈ ఫెస్టివల్‌ నిర్వహించనున్నారు. ఉత్సవాల సందర్భంగా 12న ఎకరం స్థలంలో ఏర్పాటు చేసిన దేశంలోనే అతిపెద్ద గ్లో గార్డెన్‌ను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించనున్నారు. ఇందులో వన్యప్రాణుల ప్రతిమలు, వివిధ రకాల కృత్రిమ వృక్షాలను విద్యుత్‌ దీపాలతో ఏర్పాటు చేశారు.

గుజరాత్‌లోని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ భారీ విగ్రహం వద్దనున్న మ్యూజికల్‌ ఫౌంటైన్‌ తరహాలో కోమటి చెరువుపైన ఓ ఫౌంటైన్‌ను 13న ప్రారంభించనున్నారు. 14న తెలంగాణ కళాకారులు, కవులతో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. మూడ్రోజుల పాటు సాగే ఈ లేక్‌ ఫెస్టివల్‌కు కోమటి చెరువుపైన ఉన్న నెక్లెస్‌రోడ్డు, నీటిపై తేలియాడే వంతెన, అడ్వెంచర్‌ పార్క్, రాక్‌గార్డెన్‌లతో పాటు చెరువును విద్యుత్‌ దీపాలతో అందంగా అలంకరించారు.   

మరిన్ని వార్తలు