సిమ్ స్వాప్‌‌‌ చేసి లక్షలు కాజేస్తున్న ముఠా అరెస్ట్‌

21 Jan, 2021 13:00 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సిమ్ స్వాప్‌‌ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నఅంతర్రాష్ట్ర ముఠాను సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. దశాబ్ద కాలంగా మోసాలకు పాల్పడుతున్న మహారాష్ట్రలోని ముంబైకి చెందిన మీరారోడ్డు గ్యాంగ్‌ను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 40 నకిలీ ఆధార్‌ కార్డులు, 4 రబ్బరు స్టాంపులు, 15 మొబైల్‌ ఫోన్లు, నకిలీ లెటర్‌ ప్యాడ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ మీడియాకు వివరాలు వెల్లడించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2011 నుంచి సిమ్‌ స్వాప్‌ దందా చేస్తూ రూ.కోట్లు కాజేశారని తెలిపారు. ఈ కేసులో ఐదుగురిని అరెస్టు చేసినట్లు చెప్పారు. పలు సంస్థల ఆర్థిక లావాదేవీలు చేస్తున్న ఫోన్‌ నంబర్లనే లక్ష్యంగా చేసుకుని డబ్బులు కాజేస్తున్నారని వివరించారు. ఆ లావాదేవీలు చేస్తున్న మొబైల్‌ సిమ్‌లను బ్లాక్‌ చేసి నిందితులు నగదు కాజేస్తున్నారని తెలిపారు. వీరి బారిన హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు మోసపోయారు. వీరిద్దరి నుంచి రూ.11 లక్షలు కాజేశారని చెప్పారు. అయితే ఈ ముఠాకు సంబంధించి దేశవ్యాప్తంగా అనేక అకౌంట్లు ఉన్నాయని గుర్తించినట్లు పేర్కొన్నారు. కాజేసిన డబ్బులను బిట్‌కాయిన్‌, హవాలా ద్వారా నైజీరియాకు పంపిస్తున్నారని వెల్లడించారు.

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు