హైదరాబాద్‌ నుంచి సింగపూర్‌కు ‘వైడ్‌ బాడీ’ సర్వీసులు.. వారంలో 4 రోజులు

1 Nov, 2022 15:25 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వైడ్‌ బాడీ విమాన సర్వీసులను సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ ప్రారంభించింది.  సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ అధికారులు, గెయిల్‌ అధికారులు కేక్‌కట్‌ చేసి జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం ఏ–350–900 వైడ్‌ బాడీ విమాన సర్వీసు ఇక్కడి నుంచి టేకాఫ్‌ తీసుకుంది. హైదరాబాద్‌– సింగపూర్‌ మధ్య ఈ సర్వీసు గురు, శుక్ర, శని, ఆదివారాల్లో ఉంటుంది. వైడ్‌ బాడీ ఏ–350–900 విమానంలో ఎత్తైన సీలింగ్, పెద్ద కిటికీలతో పాటు ఎక్స్‌ట్రా వైడ్‌ కారణంగా సౌకర్యవంతమైన స్థలం ఇందులో ఉంటుంది.

సింగపూర్‌ మీదుగా ఆ్రస్టేలియా.. 
ఆ్రస్టేలియా వెళ్లే ప్రయాణికులు సింగపూర్‌ మీదుగా ప్రయాణిస్తుంటారు. దాంతో ఆ్రస్టేలియా వెళ్లే ప్రయాణికులకు ఈ విమాన సరీ్వసులు అత్యధికంగా వినియోగంలోకి రానున్నాయి. సింగపూర్‌ మీదుగా వివిధ పర్యాటక ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు సైతం ఈ సరీ్వసును అత్యధికంగా వినియోగించుకునే అవకాశముంది. దక్షిణభారత దేశంలో తెలంగాణ రాష్ట్రం నుంచి ఆ్రస్టేలియాకు వెళుతున్న ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ ఏడాది ఒక్క జూలై మాసంలోనే హైదరాబాద్‌ నుంచి ఆస్ట్రేలియాకు వెళ్లిన ప్రయాణికుల సంఖ్య నలభైరెండు వేలకు పైగా ఉందని ఎయిర్‌పోర్టు వర్గాలు వెల్లడించాయి. 

మరిన్ని వార్తలు