15న 5 మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్లాంట్‌ ప్రారంభం

7 Jan, 2023 02:20 IST|Sakshi

సమీక్షలో సింగరేణి సీఎండీ శ్రీధర్‌ 

సాక్షి, హైదరాబాద్‌/జైపూర్‌: మంచిర్యాల జిల్లా జైపూర్‌లోని సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం ప్రాంగణంలో నిర్మించిన 5 మెగావాట్ల ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్లాంటును ఈనెల 15న ప్రారంభించను న్నారు. సింగరేణి సంస్థ సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ శుక్రవా రం సింగరేణి భవన్‌లో నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. రెండేళ్ల కాలంలో 8 చోట్ల ఏర్పాటు చేసిన 219 మెగావాట్ల సోలార్‌ ప్లాంట్లు ఇప్పటి వరకు 505 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయడంతో సంస్థకు రూ.300 కోట్లు ఆదా అయ్యాయి.

మూడో దశలో భాగంగా సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలోని రిజర్వాయర్‌పై 15 మెగావాట్ల సామ ర్థ్యంతో 2 ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్లాంట్లను నిర్మిస్తుండగా, అందులో సిద్ధమైన 5 మెగా వాట్ల ప్లాంట్లను సంక్రాంతి సందర్భంగా 15న ప్రారంభిస్తారు. తొలి, రెండు దశల్లో 219 మెగావాట్ల ప్లాంట్ల నిర్మాణాన్ని పూర్తి చేసిన సింగరేణి మూడో దశ కింద 300 మెగావాట్ల సోలార్‌ ప్లాంట్లను నిర్మిస్తోంది.    

మరిన్ని వార్తలు