సింగరేణి.. విద్యుదుత్పత్తిలో ప్రథమశ్రేణి

5 Jan, 2022 02:41 IST|Sakshi

సింగరేణి సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ హర్షం  

సాక్షి, హైదరాబాద్‌: మంచిర్యాల జిల్లా జైపూర్‌ లోని 1,200 మెగావాట్ల సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం 2021–22లో డిసెంబర్‌ నాటికి రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో నంబర్‌వన్‌గా నిలిచింది. అత్యధిక సామర్థ్యం(పీఎల్‌ఎఫ్‌)తో విద్యుదుత్పత్తి జరపడం తో ఈ ఘనత సాధించింది. కేంద్ర విద్యుత్‌ ప్రాధికార సంస్థ(సీఈఏ) ర్యాంకింగ్‌లో సింగరేణి విద్యుత్‌ కేంద్రం 2021 ఏప్రిల్‌– డిసెంబరు మధ్యకాలంలో 87.18% పీఎల్‌ఎఫ్‌ సాధించి ప్రథమ స్థానంలో నిలవగా, తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ(జెన్‌కో) 73.98% తో రెండో, 70.29 % తో పశ్చిమ బెంగాల్‌ జెన్‌కో మూడో స్థానంలో నిలిచాయి.

29% వృద్ధి..
2020–21లో డిసెంబర్‌ నా టికి సింగరేణి కేంద్రం 5,335 మిలియన్‌ యూనిట్ల విద్యుదుత్పత్తి చేయగా, 2021–22 డిసెంబర్‌ నాటికి 29% వృద్ధి తో 6,904 ఎంయూల విద్యు దుత్పత్తి చేసింది. విద్యుత్‌ అమ్మకాలు రూ.2,386 కోట్ల నుంచి 20% వృద్ధితో రూ.2,879 కోట్లకు పెరి గాయి. మంగళవారం ఆయన ఇక్కడ సమీక్షించా రు. శ్రీరాంపూర్‌ రైల్వేలైన్‌ విద్యుదీకరణను ఆరు నెలల్లో పూర్తి చేయాలని, లోయర్‌ మానేర్‌ డ్యాంపై ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్లాంట్‌ సర్వే పనులను నెలాఖరులోగా, డీపీఆర్‌ను ఫిబ్రవరిలోగా పూర్తి చేసి మార్చి లో టెండర్లు నిర్వహించాలని ఆదేశించారు.

మరిన్ని వార్తలు