ఎక్కడెక్కడ ఏ పంటలు వేయాలి? 

1 Oct, 2021 03:01 IST|Sakshi

అధికారులతో చర్చించిన మంత్రి నిరంజన్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: యాసంగి పంటల ప్రణాళికపై ప్రభుత్వ కసరత్తు మొదలుపెట్టింది. ఎక్కడెక్కడ ఏయే పంటలు వేయాలనే దానిపై వ్యవసాయ అధికారులతో గురువారం హాకాభవన్‌లో వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. వరికి ప్రత్యామ్నాయంగా ఏ పంటలు వేయా లనే దానిపై మంత్రి ప్రధానంగా చర్చించారు. ఎంత విస్తీర్ణంలో వేయాలి? మార్కెట్‌లో పంట ల డిమాండ్‌ ఎలా ఉంది అనే దానిపై వ్యవసాయనిపుణులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ విశ్వవిద్యాలయ అధికారులతో మంత్రి ఆరా తీశారు.

ఈ అంశాలపై సీఎం కేసీఆర్‌కు ఇచ్చే తుది నివేదికను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ సమీక్షలో వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ కోటేశ్వర్‌రావు, ఉపకులపతి ప్రవీణ్‌రావు, ప్రత్యేక కమిషనర్‌ హన్మంతు, విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ కేశవులు, ఉద్యానశాఖ డైరెక్టర్‌ వెంకట్రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు