27 రకాల సుగంధ ద్రవ్యాలతో పరిమళించే పట్టుచీర

6 Aug, 2022 14:14 IST|Sakshi
పరిమళించే పట్టు చీరతో నల్ల విజయ్‌కుమార్‌

సిరిసిల్ల: అగ్గిపెట్టెలో ఇమిడే చీరను నేసిన నల్ల పరంధాములు తనయుడు నల్ల విజయ్‌కుమార్‌ పరిమళించే పట్టు చీరను రూపొందించారు. విజయ్‌కుమార్‌ ఇప్పటికే తండ్రి పరంధాములు స్ఫూర్తితో అనేక ప్రయోగాలు చేశారు. తాజాగా 27 రకాల సుగంధ ద్రవ్యాలను కలిపిన ద్రావణంలో పట్టు పోగులను ఉడకబెట్టి పవర్‌లూమ్‌పై పట్టు చీరను నేశాడు. 


సుగంధ ద్రవ్యాల ప్రభావంతో ఆ చీర పరిమళిస్తోంది. చీర ఐదున్నర మీటర్ల పొడవు, 46 ఇంచీల వెడల్పు, 400 గ్రాముల బరువుంది. నాలుగు రోజులపాటు శ్రమించి నేసిన ఈ చీర తయారీకి రూ.12 వేలు ఖర్చయినట్లు విజయ్‌కుమార్‌ తెలిపారు. గతంలో మూడు కొంగుల చీర, ఉంగరంలో, దబ్బనంలో దూరే చీరలను, కుట్టు లేని లాల్చి, పైజామా, జాతీయ జెండాలను తయారు చేసి ప్రశంసలు అందుకున్నారు. (క్లిక్‌: డబుల్‌ బెడ్రూం ఇల్లు వెనక్కి)

మరిన్ని వార్తలు