సంచలనంగా మారిన తమ్మినేని మర్డర్‌ కేసు: ఆరుగురు అరెస్ట్‌

18 Aug, 2022 07:32 IST|Sakshi

సాక్షి, ఖమ్మం : జిల్లాలోని తెల్దార్‌పల్లిలో టీఆర్‌ఎస్‌ నేత తమ్మినేని కృష్ణయ్య హత్య సంచలనంగా మారింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పగ.. ప్రతీకారంతో ఈ హత్య ఉదంతం చర్చనీయాంశంగా మారింది. చాలా కాలం తర్వాత జిల్లాలో రాజకీయ హత్య జరగడంతో రాజకీయ పార్టీలు ఉలిక్కిపడ్డాయి. 

ఉమ్మడి జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలోనే నేతలు, కేడర్‌ మధ్య వైరం నివ్వురు గప్పిన నిప్పులా ఉంది. కాగా, తమ్మినేని కృష్ణయ్య హత్య కేసులో పోలీసులు ఆరుగురిని అరెస్ట్‌ చేశారు. వారిలో ఏ2 రంజన్‌, ఏ4 గంజిస్వామి, ఏ5 లింగయ్య, ఏ6 బోడపట్ల శ్రీను, ఏ7 నాగేశ్వరరావు, ఏ8 నాగయ్య ఉన్నారు. ఇక, ఏ1 తమ్మినేని కోటేశ్వరరావు, ఏ3 కృష్ణ పరారీలో ఉన్నారు.

ఇది కూడా చదవండి: ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. పగలు, ప్రతీకారంతో రగులుతున్న రాజకీయాలు

మరిన్ని వార్తలు