ఎస్పీడీసీఎల్‌కు ఆరు అవార్డులు 

12 Jan, 2022 04:48 IST|Sakshi

జాతీయస్థాయిలో ప్రతిభ కనబరిచిన రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ దక్షిణ విద్యుత్‌ పంపిణీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎస్పీడీసీఎల్‌)కు  జాతీయస్థాయిలో ఆరు అవార్డులు లభించాయి. దేశంలోని అన్ని విద్యుత్‌ పంపిణీ సంస్థలలో సమష్టి ప్రతిభ కనబర్చినందుకు ఎస్పీడీసీఎల్‌కు మొదటి ర్యాంకు లభించింది. ఢిల్లీ పవర్‌ సంస్థకు రెండో ర్యాంకు రాగా, ఏపీ విద్యుత్‌ సంస్థకు మూడో ర్యాంకు లభించింది. సామర్థ్య నిర్వహణ, వినియోగదారుల సేవలు, నూతన సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, పనితీరు సామర్థ్యంలో కూడా జాతీ యస్థాయిలో మొదటి, గ్రీన్‌ ఎనర్జీ విభాగంలో మూడో ర్యాంకు లభించింది. ఇండియన్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న 15వ ఇండియా ఎనర్జీ సమ్మిట్‌లో భాగంగా ఆన్‌లైన్‌లో జరిగిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో వివిధ రాష్ట్రాల డిస్కంల యాజమాన్యాలు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

సమావేశంలో అవార్డులను ప్రదానం చేశారు. వివిధ రాష్ట్రాల ప్రతినిధులు మాట్లాడుతూ నిరంతర, రైతాంగానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ సరఫరా అందిస్తోన్న తెలంగాణ విద్యుత్‌ సంస్థలను, ప్రభుత్వాన్ని ప్రశంసించారు.  ఎస్పీడీసీఎల్‌ సీఎండీ జి.రఘుమారెడ్డి మాట్లాడు తూ తెలంగాణ ఫ్రభుత్వం విద్యుత్‌ సంస్థల అభివృద్ధి కోసం అన్ని రకాల తోడ్పాటునందిస్తోంద న్నారు. ఎస్పీడీసీఎల్‌కు అవార్డులు రావడానికి కారణమైన సీఎం కేసీఆర్, విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఇంధన శాఖ కార్యదర్శి సునీల్‌ శర్మ, ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావులకు ధన్యవాదాలు తెలిపారు.   

మరిన్ని వార్తలు