స్మార్ట్‌ బోట్‌ జల ప్రవేశం.. 60 మంది ఒకేసారి

5 Sep, 2020 11:38 IST|Sakshi
స్మార్ట్‌ బోట్‌ను లాంచీస్టేషన్‌ వద్దకు తీసుకెళ్తున్న లాంచీ 

సాక్షి, నాగార్జునసాగర్‌ : స్మార్ట్‌ బోటు శుక్రవారం జలప్రవేశం చేసింది. విశాఖపట్టణానికి చెందిన సెకాన్‌ కంపెనీ ఈ బోట్‌ను తయారు చేసింది. అక్కడినుంచి లారీలో తెచ్చిన బోటును దయ్యాలగండి సమీపంలోని సమ్మక్క–సారక్క పుష్కరఘాట్‌నుంచి నీటి ఒడ్డున దింపారు. అనంతరం రబ్బరు ట్యూబులను బోట్‌ కింది భాగంలో అమర్చి వాటిలోకి గాలి నింపారు. నాలుగు ట్యూబ్‌లను పెట్టి ముందు దాంట్లో గాలి తక్కువగా ఉంచుతూ వెనుక భాగంలోని ట్యూబ్లోకి గాలి ఎక్కువగా పంపడంతో బోట్‌ ముందుకు జరుగుతూ వచ్చి నీటిలోకి జారేలా చేశారు. అనంతరం మరో లాంచీ వచ్చి దూరంగా నిలబడి తాడు సాయంతో ఈ బోట్‌ను నీటిలోకి లాగింది. జలాశయంలోకి దిగిన అనంతరం లాంచీ స్టేషన్‌కు తీసుకుపోయారు. ఈ స్మార్ట్‌బోట్‌లో 60 మంది పర్యాటకులు ప్రయాణం చేయవచ్చు. 

మరిన్ని వార్తలు