భైంసాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల అవస్థలు

14 Mar, 2021 03:58 IST|Sakshi
రాయికల్‌కు వచ్చి ఇంటర్నెట్‌ సేవలు వినియోగించుకుంటున్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని  

సాక్షి, రాయికల్‌(జగిత్యాల): నిర్మల్‌ జిల్లా భైంసా అల్లర్ల నేపథ్యంలో ఇంటర్నెట్‌ సేవలను ఆ జిల్లావ్యాప్తంగా నిలిపివేశారు. దీంతో కరోనా కారణంగా వర్క్‌ఫ్రం హోం చేస్తున్న సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిర్మల్‌ జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో ఉన్న పలువురు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు జగిత్యాల, నిజామాబాద్‌ జిల్లాలోని తమ బంధువుల ఇళ్లకు వెళ్లి అక్కడి నుంచి విధులు నిర్వర్తిస్తున్నారు.

నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మండలం మద్దిపడగ గ్రామానికి చెందిన చౌడారపు మహేశ్వరి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా చేస్తోంది. మద్దిపడగలో ఇంటర్నెట్‌ సేవలు లేకపోవడంతో జగిత్యాల జిల్లా రాయికల్‌లోని బంధువుల ఇంటికి వచ్చి విధులు నిర్వర్తిస్తోంది. తండ్రితో కలిసి మోటార్‌సైకిల్‌పై సుమారు 40 కిలోమీటర్లు రోజూ వచ్చి వెళ్తోంది. శనివారం కూడా వచ్చి విధులు నిర్వర్తించి వెళ్లింది. ఇదేవిధంగా అనేకమంది ఇంటర్‌నెట్‌ సదుపాయం కోసం ఇతర జిల్లాల్లో ఉన్న తమ బంధువుల ఇళ్లకు వెళుతున్నారు.    

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు