లాక్‌డౌన్‌లోనూ అద్భుత ప్రగతి సాధించాం

3 Sep, 2021 04:56 IST|Sakshi

సీఎం దూరదృష్టి వల్లే ఇది సాధ్యమైంది

రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో సీఎస్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రం ఏర్పాటైన ఏడేళ్లలో వేగంగా పురోగతి సాధిస్తోందని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ అన్నారు. కొనుగోలు శక్తిని పెంచడానికి ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకోవడంతో లాక్‌డౌన్‌ కాలంలోనూ రాష్ట్రం అద్భుత వృద్ధిని సాధించిందని తెలిపారు. సీఎం కేసీఆర్‌ దూరదృష్టితోనే ఇది సాధ్యమైందన్నారు. ‘ఎగుమతిదారుల సవాళ్లు.. అధిగమించడం’పై గురువారం ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలంగాణ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఇండస్ట్రీ భవన్‌లో జరిగిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఎగుమతిదారులు రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములుగా ఉన్నారని, ప్రభుత్వం ఎగుమతిదారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని హామీనిచ్చారు.

కంటైనర్ల కొరత గురించి వివిధ రకాల ఆటంకాలు ఎదుర్కొంటున్నారని, కంటైనర్ల కొరత తీర్చాలని సీఎస్‌కు ఎగుమతిదారులు విజ్ఞప్తిచేశారు. మూలధన వస్తువులకు సంబంధించి జీఎస్‌టీ రీఫండ్‌ సమస్యను కేంద్రప్రభుత్వంతో కలిసి పరిష్కరించాలని కోరారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌ రంజన్, ఎఫ్‌టీసీసీఐ అధ్యక్షుడు భాస్కర్‌ రెడ్డి, రైల్వే, డీజీఎఫ్‌టీ అధికారులు తదితరలు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు