రాష్ట్రంలో ఆక్సిజన్‌ లోటు రాదు: సీఎస్‌ 

23 Oct, 2021 03:40 IST|Sakshi
కేక్‌ కట్‌ చేస్తున్న సీఎస్‌ సోమేశ్‌కుమార్‌. చిత్రంలో వైద్యశాఖ కార్యదర్శి రిజ్వీ, ప్రజారోగ్య విభాగం డైరెక్టర్‌ శ్రీనివాస్‌రావు 

థర్డ్‌వేవ్‌ను తట్టుకునేలా చర్యలు తీసుకున్నామని వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇకపై ఆక్సిజన్‌ లోటు రాదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం 300 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ ఉత్పత్తికి రాష్ట్రంలో సౌకర్యం ఉందని తెలిపారు. కరోనా ఇంకా అంతం కాలేదని, అర్హులైన ప్రతిఒక్కరూ వ్యాక్సిన్‌ తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో 3 కోట్ల డోసుల పంపిణీ నేపథ్యంలో శుక్రవారం వైద్య, ఆరోగ్య శాఖ కార్యాల యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో సీఎస్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్‌ కట్‌ చేసి, కొవ్వొత్తులు వెలిగించి, గాల్లోకి బెలూన్లు విసిరారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ థర్డ్‌వేవ్‌ వచ్చినా దాన్ని తట్టుకునేలా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. రాష్ట్రంలో కోటి వ్యాక్సిన్లు పంపిణీ చేసేందుకు 169 రోజులు పట్టిందని, ఆ తర్వాత కోటి వాక్సిన్ల పంపిణీకి 81 రోజులు, మూడో కోటి వ్యాక్సిన్ల పంపిణీకి 36 రోజుల సమయం పట్టిందని తెలిపారు. జాతీయ సగటుతో పోలిస్తే వ్యాక్సినేషన్‌ విషయంలో రాష్ట్రం ముందంజలో ఉంద న్నారు. అనంతరం డీహెచ్‌ శ్రీనివాసరావు మాట్లాడుతూ డిసెంబర్‌ నెలాఖరు కల్లా వంద శాతం వ్యాక్సినేషన్‌ చేసేలా కార్యాచరణ సిద్ధం చేసినట్లు తెలిపారు.   

మరిన్ని వార్తలు