టికెట్ లేకుండానే రైలు ఎక్కేస్తున్నారు.. పెనాల్టీ రూపంలో రూ.9.62 కోట్లు.. రైల్వే చరిత్రలో తొలిసారి

22 Mar, 2023 09:26 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రైళ్లలో టికెట్‌ లేకుండా ప్రయాణించే వారి సంఖ్య ఏ స్థాయిలో ఉందో ఈ ఉదంతం స్పష్టం చేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేవలం తొమ్మిది మంది రైల్వే తనిఖీ సిబ్బంది ఏకంగా రూ.9.62 కోట్లు వసూలు చేశారు. సగటున ఒక్కొక్కరూ రూ.కోటిని మించి వసూలు చేశారన్నమాట.

టికెట్‌ లేకుండా ప్రయాణించేవారు, ముందస్తు బుకింగ్‌ లేకుండా సామగ్రి తరలించేవారిని గుర్తించి అపరాధ రుసుము వసూలు చేయటంలో తొమ్మిది మంది టికెట్‌ తనిఖీ సిబ్బంది చురుగ్గా వ్యవహరించి పెద్దమొత్తంలో పెనాలీ్టలు వసూలు చేశారు.

ఇలా ఒక అధికారి రూ.కోటికిపైగా పెనాల్టీ వసూలు చేయటం రైల్వే చరిత్రలోనే తొలిసారి కావటం విశేషం. సికింద్రాబాద్‌ డివిజన్‌ నుంచి ఏడుగురు, గుంతకల్, విజయవాడ డివిజన్ల నుంచి ఒక్కొక్కరి చొప్పున ఈ ఘనత సాధించారు. సికింద్రాబాద్‌ డివిజన్‌కు చెందిన చీఫ్‌ టికెట్‌ ఇన్‌స్పెక్టర్‌ నటరాజన్‌ 12,689 మంది ప్రయాణికుల నుంచి ఏకంగా రూ.9.16 కోట్లు వసూలు చేయటం విశేషం.
చదవండి: టీఎస్‌పీఎస్సీ లీకేజ్‌ కేసులో తెరపైకి కొత్త పేరు.. స్నేహితుడికీ షేర్ చేశాడు!

>
మరిన్ని వార్తలు