16 నెలల తర్వాత ‘ప్యాసింజర్ల’ కూత

17 Jul, 2021 13:53 IST|Sakshi

19 నుంచి అందుబాటులోకి పలు ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్‌ రైళ్లు

సాక్షి, హైదరాబాద్‌: దాదాపు 16 నెలల సుదీర్ఘ విరామం తర్వాత కొన్ని ప్యాసింజర్‌ రైళ్లను ప్రారంభించేందుకు దక్షిణ మధ్య రైల్వే సిద్ధమైంది. గతేడాది కోవిడ్‌ తొలిదశ లాక్‌డౌన్‌ సందర్భంగా మార్చి నెలాఖరు నుంచి రైళ్లను నిలిపివేసిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ సడలింపులతో కొన్ని స్పెషల్‌ రైళ్లుగా ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులను ప్రారంభించిన రైల్వే.. ప్యాసింజర్‌ రైళ్లను మాత్రం ప్రారంభించలేదు. ఇప్పుడు దశలవారీగా వాటిని ప్రాంభించాలని నిర్ణయించింది.

ఈ మేరకు రైల్వేబోర్డు జోనల్‌ రైల్వే అధికారులకు ఆదేశాలు జారీచేసింది. దీంతో జూలై 19 నుంచి నాలుగు రోజుల్లో తొలివిడతగా 66 ప్యాసింజర్‌ స్పెషల్‌ సర్వీసుల (జోన్‌ అంతా కలిపి)ను ప్రారంభిస్తోంది. వీటిని కొత్త సమయాలు, నంబర్లతో నడపనున్నారు. వీటితోపాటు జోన్‌ పరిధిలో నడిచే కొన్ని స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులనూ ప్రారంభిస్తున్నారు. మెమూ, డెమూ రైళ్లనే ఈ స్పెషల్‌ సర్వీసులుగా నడుపుతుండటం విశేషం.  

19న ప్రారంభమయ్యే ఎక్స్‌ప్రెస్‌లు 
కాజీపేట–సిర్పూర్‌ టౌన్‌ (ఉదయం 5.20), సిర్పూరు టౌన్‌–భద్రాచలం రోడ్‌ (12.30), హైదరాబాద్‌–పూర్ణ (8.15), పూర్ణ–హైదరాబాద్‌(7.40), విజయవాడ–గూడూరు (5.25), కాకినాడ పోర్టు– విజయవాడ (4.45), కాకినాడ పోర్టు–విశాఖపట్నం (5.00), విశాఖపట్నం– కాకినాడ పోర్టు (17.05). 

19న ప్రారంభమయ్యే ప్యాసింజర్‌ రైళ్లు 
వాడీ–కాచిగూడ (14.25), ఫలక్‌నుమా–వాడి (5.00), డోర్నకల్‌–కాజీపేట (21.10), విజయవాడ–డోర్నకల్‌ (18.15), సికింద్రాబాద్‌– కాలబుర్గీ (18.00), కాచిగూడ–మహబూబ్‌నగర్‌ (21.50), మహబూబ్‌నగర్‌–కాచిగూడ (6.45), కాచిగూడ–నడికుడి (9.20), నడికుడి– కాచిగూడ (16.10), కాచిగూడ–కరీంనగర్‌ (6.00). 

20 నుంచి ప్రారంభమయ్యే ఎక్స్‌ప్రెస్‌లు 
భద్రాచలం రోడ్‌–సిర్పూర్‌ టౌన్‌ (6.00), సిర్పూర్‌ టౌన్‌–కాజీపేట (15.50). 

20న ప్రారంభమయ్యే ప్యాసింజర్‌ రైళ్లు 
వరంగల్‌–సికింద్రాబాద్‌ (5.15), హైదరాబాద్‌–కాజీపేట (18.50), కరీంనగర్‌–పెద్దపల్లి (8.00), పెద్దపల్లి–కరీంనగర్‌ (13.10), కరీంనగర్‌–కాచిగూడ (14.20), కాలబుర్గీ–సికింద్రాబాద్‌(3.30).
 
21 నుంచి ప్రారంభమయ్యే ఎక్స్‌ప్రెస్‌  
గుంటూరు–కాచిగూడ (5.15). 

21 నుంచి ప్రారంభమయ్యే ప్యాసింజర్లు
కాజీపేట–డోర్నకల్‌ (6.40), డోర్నకల్‌–విజయవాడ (9.00), సికింద్రాబాద్‌–మనోహరాబాద్‌ (6.10), మనోహరాబాద్‌–సికింద్రాబాద్‌ (8.45), కాచిగూడ–రాయచూరు (6.20), రాయచూరు–కాచిగూడ (17.00), పర్లీ–ఆదిలాబాద్‌ (15.45), విజయవాడ–మంచిర్యాల (15.30). 

22న ప్రారంభమయ్యే ఎక్స్‌ప్రెస్‌ 
కాచిగూడ–గుంటూరు (5.10). 

22న ప్రారంభమయ్యే ప్యాసింజర్‌ రైలు:
ఆదిలాబాద్‌–పర్లి (3.30).   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు