సికింద్రాబాద్‌–కటక్‌ ప్రత్యేక రైళ్లు  

20 May, 2022 02:18 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సికింద్రాబాద్‌–కటక్‌ మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్‌.రాకేశ్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

సికింద్రాబాద్‌–కటక్‌ (07581/07582) ప్రత్యేక రైలు ఈ నెల 21వ తేదీ ఉదయం 8.30 గంటలకు బయల్దేరి మర్నాడు ఉదయం 6.15 గంటలకు కటక్‌ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 22వ తేదీ సాయంత్రం 6.55 గంటలకు బయల్దేరి మర్నాడు సాయంత్రం 5.20 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది.   

మరిన్ని వార్తలు