సంక్రాంతి ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.. స్పెషల్‌ రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే.. వివరాలివే..

27 Dec, 2022 19:55 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సంక్రాంతి పండుగ కోసం ప్రయాణాలు చేసే వాళ్ల కోసం గుడ్‌ న్యూస్‌ చెప్పింద దక్షిణ మధ్య రైల్వే. ఈసారి పండుగ సందర్భంగా 94 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. రద్దీని దృష్టిలో పెట్టుకుని.. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఈ ఏర్పాట్లను చేసినట్లు తెలిపింది. 

పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని వివిధ ప్రాంతాలకు ఈ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ముఖ్యంగా.. తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణానికి అధిక డిమాండ్‌ ఉండడంతో.. అందుకు తగ్గట్లుగా రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. 

2023 జనవరి 1వ తేదీ నుంచి 20వ తారీఖు నడుమ.. వేర్వేరు తేదీల్లో ఈ రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే స్పష్టం చేసింది. కేవలం తెలుగు రాష్ట్రాల మధ్య మాత్రమే కాకుండా.. దేశంలోని ప్రసిద్ధ గమ్యస్థానాల నడుమ ఇవి నడుస్తున్నాయని తెలిపింది. 

మరిన్ని వార్తలు