దేశంలోనే తొలి కార్గో ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభం 

6 Aug, 2020 08:32 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్ ‌: దేశంలోనే తొలి కార్గో ఎక్స్‌ప్రెస్‌ రైలు బుధవారం సనత్‌నగర్‌ స్టేషన్‌లో దక్షిణ మధ్య రైల్వే ప్రారంభించింది. ప్రతి బుధవారం సాయంత్రం సనత్‌నగర్‌ స్టేషన్‌లో బయలుదేరే ఈ సరుకు రవాణా రైలు శుక్రవారం ఉదయం ఢిల్లీలోని ఆదర్శ్‌నగర్‌ స్టేషన్‌కు చేరుకుంటుంది. సరుకు రవాణా రేక్‌ మొత్తాన్ని బుక్‌ చేసుకునే విధానానికి భిన్నంగా కనిష్టంగా 60 టన్నుల సరుకైనా బుక్‌ చేసుకునే సదుపాయం రైల్వే కల్పించింది. ఎంత సరుకు లోడ్‌ అయిందన్న విషయంతో ప్రమేయం లేకుండా నిర్ధారిత సమయాల ఆధారంగా రైలు నడుస్తుంది. ఇంతకాలం చిన్న వ్యాపారులు ఢిల్లీకి సరుకు పంపాలం టే రోడ్డు మార్గాన పంపాల్సి వచ్చేది. ఇప్పుడు రైలు అందుబాటులోకి రావటంతో ఖర్చులో 40 శాతం ఆదా అవుతుందని అధికారులు చెబుతున్నారు. గంటకు 50 కి.మీ. వేగంతో ప్రయాణించే ఈ సరుకు రవాణా రైలును ఆరు నెలల పాటు ప్రయోగాత్మకంగా నడిపించనున్నారు.  

మరిన్ని వార్తలు