రాష్ట్రానికి నైరుతి..

13 Jun, 2022 00:37 IST|Sakshi

అనుకూలంగా పరిస్థితులు.. చురుగ్గా వ్యాప్తి చెందే అవకాశం 

సాక్షి, హైదరాబాద్‌: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నైరుతి రుతుపవనాలు సోమవారం రాష్ట్రాన్ని తాకనున్నాయి. ప్రస్తుతం రాష్ట్రానికి పశ్చిమ దిశ నుంచి వీస్తున్న గాలు లు, ఇతర వాతావరణ పరిస్థితులు అనుకూ లంగా ఉండటంతో నైరుతి రుతుపవనాలు చురుకుగా వ్యాప్తి చెందే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. పరిస్థితు లు ఇలాగే కొనసాగితే రానున్న మూడు, నాలు గు రోజుల్లో రుతుపవనాలు రాష్ట్రమంతటా విస్తరించే అవకాశం ఉందని నిపుణులు చెబు తున్నారు.

సోమవారం మధ్యాహ్నం కల్లా నైరు తి రుతుపవనాలు ఉత్తర అరేబియా సము ద్రంలోని కొన్ని ప్రాంతాలు, కొంకణ్‌లోని మిగి లిన భాగాలు, గుజరాత్‌ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలు, మధ్య మహారాష్ట్రలోని చాలా ప్రాంతాలు, మొత్తం కర్ణాటక, తమిళనాడు, తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు, ఆంధ్ర ప్రదేశ్‌ పశ్చిమ, మధ్య, వాయవ్య బంగాళా ఖాతం ప్రాంతాల్లో ముందుకు సాగనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

కాగా, ఈశాన్య బంగాళాఖాతం నుంచి నైరుతి బంగాళాఖాతం వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలో చాలాచోట్ల ఉరుములు, మెరుపులు ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది.   

మరిన్ని వార్తలు