పెద్ద దుష్మన్‌ కాంగ్రెస్సే

15 Aug, 2021 00:57 IST|Sakshi
మాట్లాడుతున్న ఎంపీ అర్వింద్‌

కులాలవారీగా దేశాన్ని విభజించి నాశనం చేసింది

కేసీఆర్‌ను గద్దె దించేందుకు మూడు నెలలు చాలు

ఎంపీలు అర్వింద్, సోయం, ఎమ్మెల్యే రఘునందన్‌రావు

నిర్మల్‌లో హిందూవాహిని అఖండ భారత్‌ దివస్‌

నిర్మల్‌: దేశానికి, సమాజానికి పెద్ద దుష్మన్‌ కాంగ్రెస్‌ పార్టీయేనని, కులాలు మతాలుగా ప్రజలను వీడదీసిందని, 75 ఏళ్ల నుంచి కేన్సర్‌ వ్యాధిలా పీడిస్తోందని ఎంపీలు సోయం బాపూరావు, ధర్మపురి అర్వింద్, ఎమ్మెల్యే రఘునందన్‌రావు దుయ్యబట్టారు. రేవంత్‌రెడ్డి అహంకారంతో మాట్లాడుతున్నారని, కేసీఆర్‌ను మూడు నెలల్లోనే గద్దెదించవచ్చని పేర్కొన్నారు. నిర్మల్‌ జిల్లా కేంద్రంలో హిందూవాహిని ఆధ్వర్యంలో శనివారం అఖండ భారత్‌ దివస్‌ సభ నిర్వహించారు. హిందూవాహిని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల అధ్యక్షుడు రాజవర్ధన్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు హరిచంద్రరెడ్డి మాట్లాడుతూ.. భైంసా ఘటనల్లో ఒకవర్గం యువకులపైనే తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపారని మండిపడ్డారు. 1970 నుంచి 2020 వరకు భైంసా అల్లర్లలో హిందువులే నష్టపోయారని చెప్పారు. 

కేసీఆర్‌వి చిల్లర రాజకీయాలు 
మనోడే మోసం చేస్తే వంద అడుగుల బొంద తీసి పాతిపెట్టాలని కాళోజీ చెప్పారని, ఇప్పుడు రాష్ట్రంలో భయంకర హిందువునని చెప్పుకొనే సీఎం ఉన్నా భైంసాలో హిందువులపై దాడులు జరుగుతున్నాయని ఎంపీ ధర్మపురి అర్వింద్‌ మండిపడ్డారు. పనికిరాని కొడుకును సీఎం చేసేందుకు సీఎం కేసీఆర్‌ చిల్లర రాజకీయాలు చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. ఇంద్రవెల్లిలో ఆదివాసీలను చంపింది కాంగ్రెసేనని, అదే గడ్డకు వెళ్లి రేవంత్‌రెడ్డి అబద్ధాలు చెబుతున్నారని పేర్కొన్నారు. కొందరు ఐపీఎస్‌ అధికారులు యూనిఫాం లోపల గులాబీ కండువాలు వేసుకుని పనిచేస్తున్నారని, అలాంటి వారి లెక్క లు రాసిపెట్టి, తాము అధికారంలోకి వచ్చాక వారి సంగతి చూస్తామని హెచ్చరించారు. 

ఒవైసీ చేతిలో కారు స్టీరింగ్‌..
రాష్ట్రంలో పేరుకే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నడుస్తోందని, కారు స్టీరింగ్‌ మాత్రం ఒవైసీ చేతుల్లో ఉందని ఎంపీ సోయం బాపూరావు అన్నారు. భైంసాలో 40 ఏళ్లుగా అధికార పార్టీతో కుమ్మక్కై ఎంఐఎం దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి తొత్తులుగా మారిన పోలీసులు ఒక వర్గం యువతపైనే కేసులు పెడుతున్నారని ఎమ్మెల్యే రఘునందన్‌రావు మండిపడ్డారు. 

ఒవైసీ చేతిలో కారు స్టీరింగ్‌..
రాష్ట్రంలో పేరుకే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నడుస్తోందని, కారు స్టీరింగ్‌ మాత్రం ఒవైసీ చేతుల్లో ఉందని ఎంపీ సోయం బాపూరావు అన్నారు. భైంసాలో 40 ఏళ్లుగా అధికార పార్టీతో కుమ్మక్కై ఎంఐఎం దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి తొత్తులుగా మారిన పోలీసులు ఒక వర్గం యువతపైనే కేసులు పెడుతున్నారని ఎమ్మెల్యే రఘునందన్‌రావు మండిపడ్డారు. 

మరిన్ని వార్తలు