'మొబైల్‌ యాప్స్‌ ఆరోగ్యస్థితిని గుర్తించలేవు'

28 Jul, 2020 21:30 IST|Sakshi

సాక్షి, భువనగిరి : ' మీ రక్తంలో ఆక్సిజన్ స్థాయిని తనిఖీ చేసే మొబైల్ అప్లికేషను డౌన్‌లోడ్ చేసుకోండి అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో మెసేజ్ ఫార్వార్డ్ చేస్తున్నారు. శరీరంలో ఆక్సిజన్ స్థాయి, బీపీ, హార్ట్ బీట్ మొదలైనవి చెక్ చేసుకోడానికి ఈ మొబైల్ యాప్ ఉపయోగకరంగా ఉంది అంటూ నమ్మిస్తున్నారు. అయితే మొబైల్ యాప్స్ ఎలాంటి ఆరోగ్య స్థితి, ఆనారోగ్యం, బీపీ , పల్స్, ఆక్సిజన్ శాతాన్ని గుర్తించలేవు' అంటూ జిల్లా ఎస్పీ బాస్కరన్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఆయన మాట్లాడుతూ.. 'ఈ కరోనా సంక్షేమ సమయంలో ఇలాంటి యాప్స్ ద్వారా మీ వెలి ముద్రలు సేకరించి మీ విలువైన సమాచారాన్ని దొంగిలించి ఆర్ధిక నష్టాన్ని కలగజేయడానికి సైబర్ నేరగాళ్లు వేస్తున్న సరికొత్త సైబర్ ఎత్తుగడ అని ఇలాంటి వాటిని నమ్మి మోసపోవద్దు. మీ చూపుడు వేలు వివిధ వ్యక్తిగత డేటా ప్రామాణికత కోసం ఉపయోగించబడుతుందని గమనించగలగాలి. గూగుల్ పే వంటి యాప్స్ డౌన్లోడ్ చేయగానే ఆక్సిజన్ స్థాయిలను లెక్కించడానికి కెమెరాలో మన వేలిని ఉంచమని అడుగుతాయి.అయితే మన వేలిముద్రలను హ్యకర్లు దొంగలించే అవకాశం ఉంది. బ్యాంక్‌ఖాతా లావాదేవీ హెచ్చరికలను చదవడం ద్వారా అకౌంట్‌లో ఎంత డబ్బు ఉందనేది హ్యాకర్లు ఇట్టే పసిగడతారు.ఇలాంటి యాప్స్‌తో జాగ్రత్తగా ఉండాలని, వాటిని డౌన్‌లోడ్ చేయవద్దు.' అంటూ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు