-

ఆర్టీసీ ‘హైదరాబాద్‌ దర్శిని’.. వీకెండ్‌లో స్పెషల్‌ సర్వీసులు 

14 Oct, 2022 09:09 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: నగరంలోని చారిత్రక, పర్యాటక స్థలాలను సందర్శించేందుకు ఆర్టీసీ ప్రవేశపట్టిన ‘హైదరాబాద్‌ దర్శిని’ సిటీ టూర్‌ బస్సుల సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రతి శని, ఆదివారాల్లో వీటిని నడుపుతారు. 12 గంటల సమయంలో హైదరాబాద్‌లోని ముఖ్యమైన ప్రదేశాలను సందర్శించే విధంగా ఈ సిటీ టూర్‌ ఉంటుందని అధికారులు తెలిపారు.  

- శని, ఆదివారాల్లో సికింద్రాబాద్‌ ఆల్ఫా హోటల్‌ నుంచి ఉదయం 8.30 గంటలకు బయలుదేరుతాయి.   
- బిర్లామందిర్, చౌమొహల్లా ప్యాలెస్, తారామతి బారదరిలో రిసార్ట్స్‌లో మధ్యాహ్నం భోజనం అనంతరం గోల్కొండ కోటను సందర్శిస్తారు. 

ఆ తరువాత దుర్గం చెరువు, కేబుల్‌ బ్రిడ్జ్, హుస్సేన్‌ సాగర్, ఎన్టీఆర్‌ పార్క్‌ తదితర ప్రాంతాలను సందర్శించిన అనంతరం రాత్రి 8 గంటలకు తిరిగి సికింద్రాబాద్‌ అల్ఫా హోటల్‌ వద్దకు చేరుకుంటారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం ఖర్చులను ప్రయాణికులే భరించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.  

ఛార్జీలు ఇవే.. 
- మెట్రో ఎక్స్‌ప్రెస్‌లలో  పెద్దలకు రూ.250,  పిల్లలకు రూ.130 . 
- మెట్రో లగ్జరీ బస్సుల్లో.. పెద్దలకు రూ.450 , పిల్లలకు రూ.340 .

మరిన్ని వార్తలు