కేంద్ర పథకాలపై ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్న బీజేపీ 

30 May, 2022 00:18 IST|Sakshi

ప్రత్యేక కార్యక్రమాలతో ప్రచారం

ఈ నెల 30 నుంచి జూన్‌ 14 వరకు ప్రజలకు కేంద్ర ప్రభుత్వ పథకాల వివరణ

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, యువత, మహిళ, మైనారిటీలతో భేటీలు

సాక్షి, హైదరాబాద్‌: ప్రధాని మోదీ 8 ఏళ్ల పాలనలో సాధించిన ప్రగతి, సంక్షేమ కార్యక్రమాల ద్వారా రాష్ట్రానికి వివిధ రూపాల్లో అందుతున్న నిధులు వంటి అంశాలపై ‘సేవ, సుపరిపాలన, గరీబ్ కళ్యాణ్’పేరిట ఈనెల 30 నుంచి జూన్‌ 14 దాకా రాష్ట్ర వా‍్యప్తంగా రాష్ట్ర బీజేపీ ప్రచార కార్యక్రమాలు నిర్వహించనుంది. దీంతో పాటు 8 ఏళ్ల కేసీఆర్‌ పాలనలో వివిధ వర్గాల ప్రజలకు ఎదురైన సమస్యలు, హామీలు అమలు చేయకపోవడం, వివిధ రంగాల్లో వైఫలా‍్యలు తదితర విషయాలపై టీఆర్‌ఎస్‌ తీరును ఎండగట్టాలని నిర్ణయించింది. 

75 గంటలు ప్రత్యేక కార్యక్రమాలు...
ప్రతీ పోలింగ్‌ బూత్‌ కమిటీ అధ‍్యక్షుడు, ఆపై నాయకులు ఆయా బూత్‌లలో పబ్లిక్ ఔట్ రీచ్ కార్యక్రమాలను చేపట్టనునా‍్నరు. ఇందులో భాగంగా ఒక్కో మండలంలో 75 మంది పాల్గొనేలా ఏరా‍్పట్లు చేస్తునా‍్నరు. మే 30 నుంచి జూన్‌ 14 వరకు ‍ఈ నాయకులంతా ప్రతీరోజు 5 గంటల చొప్పున 15 రోజుల్లో మొత్తం 75 గంటలు పార్టీ ప్రచార, నిరే‍్దశిత కార్యక్రమాలకు కేటాయిస్తారు. పథకాల లబ్ధిదారులతో సంభాషణ, వికాస్ తీర్థ బైక్ ర్యాలీ, బాబాసాహెబ్ విశ్వాస్ ర్యాలీ, బిర్సా ముండా విశ్వాస్ ర్యాలీ, ప్రాంతీయ స్థాయిలో (వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, నల్లగొండ, మెదక్) ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహిస్తారు.

కార్యక్రమాలు ఇలా...
ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, యువత, మహిళ, రైతులు, మైనారిటీలు టార్గెట్‌గా ఔట్ రీచ్ కార్యకలాపాలు నిర్వహించనున్నారు. 
జూన్‌ 4న ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో ఎస్టీ నాయకులు, ఎంపీలతో కుమ్రుం భీం విశ్వాస్ ర్యాలీ, గిరిజన మేళా నిర్వహణతోపాటు ఎస్టీలు అధికంగా ఉన్న జిల్లాల్లో సమ్మేళనాలు చేపడతారు. 
జూన్ 6న మైనారిటీల వద్దకు ఔట్‌రీచ్‌ ప్రోగ్రామ్‌. 
జూన్‌ 7న యువమోర్చా ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో వికాస్ తీర్థ బైక్ ర్యాలీల ద్వారా కేంద్ర ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టు ప్రదేశాలను సందర్శన. 
జూన్ 8న ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో బాబా సాహెబ్ విశ్వాస్ ర్యాలీ, చౌపాల్ భైఠక్ (బస్తీ సమావేశం) ఎస్సీల జనాభా ఎక్కువగా ఉండే జిల్లాల్లో ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుల ద్వారా నిర్వహణ. 
జూన్ 9న మహిళా మోర్చా ఆధ్వర్యంలో పొదుపు సంఘాల సమావేశాలు. 
జూన్ 10న కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో 8 ఏళ్లలో రైతుల కోసం ప్రవేశపెట్టిన వివిధ పథకాలను రైతాంగానికి వివరించడం
జూన్ 11న ఓబీసీ మోర్చా ద్వారా సమాజంలోని పీడిత వర్గాలకు కేంద్ర పథకాల వర్తింపుపై వివరణ
జూన్ 12న వాక్సినేషన్, హెల్త్ వలంటీర్లకు సత్కారం
జూన్ 13న పట్టణ మురికివాడల పర్యటన
జూన్ 14న వివిధ రంగాల్లో నిష్ణాతులు, విజేతలను గుర్తించి పౌర సన్మానం.

మరిన్ని వార్తలు