మహిళా జర్నలిస్టులకు రెండ్రోజుల శిక్షణా తరగతులు 

5 Apr, 2022 03:02 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మహిళా జర్నలిస్టుల కు ఈనెలలో ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ వెల్లడించారు. హైదరాబాద్‌లో రెండు రోజులపాటు జరిగే ఈ శిక్షణా తరగతుల్లో పాల్గొనాలనుకునే వారు మీడియా అకాడమీ మేనేజర్‌ వనజ (7702526489)కు ఫోన్‌ చేసి, పేరు నమోదు చేసుకోవాలని సూచించారు.

జిల్లాల వారు ఆయా జిల్లాల పౌర సంబంధాల అధికారి కార్యాలయంలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మొదటిరోజు ‘మహిళా జర్నలిస్టులు– ప్రధాన స్రవంతి మీడియా– మహిళల పాత్ర’, ‘పాత్రికేయ రంగంలో మహిళలు– ప్రత్యేక సమస్యలు’అనే అంశంపై తరగతులు ఉంటాయని తెలిపారు. రెండో రోజు ‘మహిళా అస్తిత్వం–జెండర్‌ సెన్సిటైజేషన్‌’, ‘ఫీచర్‌ జర్నలిజం– మెళకువలు’అనే అంశాలపై ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియాలో నిష్టాతులైన వారి ప్రసంగాలు ఉంటాయని పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు