Yadadri: రాజగోపురం దిగువభాగంలో ఆధ్యాత్మిక రూపాలు

4 Oct, 2021 07:40 IST|Sakshi

యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రాభివృద్ధిలో భాగంగా ప్రధానాలయం పడమటి రాజగోపురం దిగువభాగంలో నిర్మించిన రిటైనింగ్‌ వాల్‌పై ఆధ్యాత్మిక రూపాలతో కూడిన ప్యానల్స్‌ ఏర్పాటు చేసేందుకు వైటీడీఏ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే బిగించిన ఏనుగుల ప్యానల్స్‌ మధ్యలో నృసింహుడితో పాటు శంఖు, చక్రనామాలు, వివిధ దేవతామూర్తులు కొలువైన ప్యానల్స్‌ను బిగించనున్నారు.

కాకతీయతోరణం మాదిరిగా ఉన్న ఈ ప్యానల్స్‌ను రాజస్తాన్‌ నుంచి తెప్పించారు. ఇండోర్‌ నుంచి ద్వారక కంపెనీ ఆధ్వర్యంలో తెప్పించిన విద్యుత్‌ దీపాలను పుష్కరిణి చుట్టూ వాల్‌పై ఏర్పాటు చేస్తున్నారు. సీతాకోక చిలుక రెక్కల ఆకారంలో ఉన్న ఈ ఆర్నమెంటల్‌ విద్యుత్‌ దీపాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి.

 

ధర్మదర్శనానికి గంట!
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. హైదరాబాద్‌ జంటనగరాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి సుమారు 20వేలమంది భక్తులు వచ్చి స్వామి, అమ్మవారిని దర్శించుకున్నారు. ధర్మ దర్శనానికి గంట, అతిశీఘ్ర దర్శనాలకు     20 నిమిషాల సమయం పట్టింది. భక్తుల రద్దీ దృష్ట్యా వాహనాలను కొండపైకి అనుమతించలేదు. పాతగుట్టలో సైతం భక్తుల రద్దీ కొనసాగింది. వివిధ పూజల ద్వారా ఆలయానికి రూ.16,58,864 ఆదాయం వచి్చనట్లు అధికారులు వెల్లడించారు.        

              

మరిన్ని వార్తలు