హైదరాబాద్‌లో రేసింగ్‌.. కుర్ర‘కారు’.. హుషారు

23 Aug, 2021 12:34 IST|Sakshi

రాయదుర్గం: ఐటీ కారిడార్‌లో రేసింగ్‌ కార్లు రయ్‌ రయ్‌మంటూ దూసుకెళ్లాయి. రెండు కార్లు ఐటీ కారిడార్‌ హైదరాబాద్‌ నాలెడ్జిసిటీ రోడ్డు నుంచి మాదాపూర్‌ దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి మీదుగా రోడ్‌ నంబర్‌ 45 వరకు వెళ్లి అక్కడి నుంచి తిరిగి హైదరాబాద్‌ నాలెడ్జి సిటీ రోడ్డు వరకు వచ్చాయి. వీటిని అనందిత్‌రెడ్డి, అఖిల్‌ రవీంద్ర నడిపారు. ఇవి గంటకు 250 కి.మీ వేగంతో ప్రయాణం చేస్తా యి. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు యువత ఆసక్తి కనబర్చారు. దేశంలో మోటార్‌ స్పోర్ట్స్‌కు మంచి అవకాశాలు ఉన్నాయని రేసింగ్‌ ప్రమోషన్స్‌ చైర్మన్‌ అఖిలేష్‌ రెడ్డి పేర్కొన్నారు.



చదవండి: 3 కి.మీ. మోసుకెళ్లినా దక్కని గర్భిణి ప్రాణం

రాయదుర్గం సర్వేనెంబర్‌ 83లోని హైదరాబాద్‌ నాలెడ్జి సిటీలో వరల్డ్‌ క్లాస్‌ ఎఫ్‌ఐఏ గ్రేడ్‌ స్ట్రీట్‌ సర్క్యూట్‌లో భాగంగా రెండు రేసింగ్‌ కార్లతో రేసింగ్‌ ట్రయల్‌ రన్‌ తరహా కార్యక్రమాన్ని సంస్థ ప్రతినిధులు రమా, సుధా, సులోచన్‌ జ్యోతి వెలిగించి ఆదివారం ప్రారంభించారు. మెగా సంస్థ అధినేత కృష్ణారెడ్డి, ఆర్‌పీపీఎల్‌ జాయింట్‌ ఎం.డీ. అర్మాన్‌ ఇబ్రహీం, ఆదిత్య పటేల్, ఆర్‌పీపీఎల్‌ ప్రతినిధి పీపీ రెడ్డి, నవజీత్‌ తదితరులు పాల్గొన్నారు. 


(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

చదవండి: వైరల్‌ వీడియో: కన్నకొడుకు కంటే ఈ కుక్కే నయం..!

>
మరిన్ని వార్తలు