హైదరాబాద్‌లో స్పుత్నిక్‌ టీకాలు షురూ! 

18 May, 2021 02:54 IST|Sakshi
టీకా వేయించుకుంటున్న రెడ్డీస్‌ ల్యాబ్స్‌ ఉద్యోగి

రెడ్డీస్‌ ల్యాబ్స్‌ ఉద్యోగికి మొదటి డోసు 

అపోలో ఆస్పత్రుల్లో టీకాలు

నెల రోజుల్లో రానున్న 10లక్షల డోసులు

బంజారాహిల్స్‌: రష్యా తయారీ స్పుత్నిక్‌–వి టీకాల కార్యక్రమం హైదరాబాద్‌లో సోమవారం ప్రారంభమైంది. జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో తొలిడోసును డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ ఫార్మా సంస్థకు చెందిన ఒక ఉద్యోగికి వేశారు. మన దేశంలో ప్రస్తు తం స్పుత్నిక్‌ టీకాలను రెడ్డీస్‌ ల్యాబ్స్‌ ఆధ్వర్యంలో ప్రయోగాత్మకంగా ఇస్తున్నారు. ఇందులో భాగంగా ఆ సంస్థతో అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌ భాగస్వా మ్యం కుదుర్చుకుంది. ప్రస్తుతం రెడ్డీస్‌ ల్యాబ్స్‌ దిగుమతి చేసుకున్న మొదటి బ్యాచ్‌ 1.50 లక్షల స్పుత్నిక్‌ డోసులను వేయనున్నామని, నెల రోజుల వ్యవధిలో మొత్తంగా 10 లక్షల డోసులు రానున్నా యని అపోలో జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంగీతారెడ్డి వెల్లడించారు.

తమ నెట్‌వర్క్‌ వ్యాప్తం గా టీకా కేంద్రాలను తెరిచి, వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. అపోలో హాస్పిటల్స్, అపోలో క్లినిక్స్‌ సహా 60కిపైగా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు ఆస్పత్రి ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ డివిజన్‌ అధ్యక్షుడు  కె.హరిప్రసాద్‌ తెలిపారు. రెడ్డీస్‌ ల్యాబ్స్‌ బ్రాండెడ్‌ మార్కెట్స్‌ సీఈవో ఎంవీ రమణ మాట్లాడుతూ.. తొలి బ్యాచ్‌ టీకాను హైదరాబాద్, విశాఖలో ప్రయోగాత్మకంగా ప్రారంభించామని, త్వరలోఢిల్లీ, ముంబై, బెంగళూరు, అహ్మదాబాద్, చెన్నై, కోల్‌కతాలో మొదలుపెడతామని వెల్లడించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు