వ్యాసరచన పోటీల్లో శ్రీ చైతన్య విద్యార్థుల ప్రతిభ

16 Nov, 2022 01:32 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మధుమేహ వ్యాధి ప్రబలడానికి కారణాలు, నివారణ చర్యలపై అవగాహన పెంచడానికి విజయవాడలోని వీజీఆర్‌ డయాబెటిక్‌ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి, శ్రీ చైతన్య స్కూల్‌ నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో శ్రీ చైతన్య స్కూల్‌ విద్యార్థులు భారీ సంఖ్యలో విజేతలుగా నిలిచారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని శ్రీ చైతన్య స్కూల్‌ విద్యార్థులకు నిర్వహించిన ఈ పోటీల్లో 40,358 మంది విద్యార్థులు పాల్గొనగా.. 2,295 మంది విజేతలుగా నిలిచారు.

ఈ సందర్భంగా మంగళవారం విజయవాడలోని సిద్ధార్ధ ఆడిటోరియంలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో విజేతలను ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ అభినందించారు. కార్యక్రమంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు, వీజీఆర్‌ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ చైర్మన్‌ కె.వేణుగోపాల్‌ రెడ్డి పాల్గొన్నారు. విజేతలను శ్రీ చైతన్య విద్యాసంస్థల వ్యవస్థాపక చైర్మన్‌ డాక్టర్‌ బీఎస్‌ రావు అభినందించారు.  

మరిన్ని వార్తలు