ఉద్యాన డిప్లొమా కోర్సులకు దరఖాస్తులు

10 Sep, 2022 02:16 IST|Sakshi

ఈనెల 22 వరకు గడువు

సాక్షి, సిద్దిపేట: సిద్దిపేట జిల్లా ములుగులోని శ్రీ కొండా లక్ష్మణ్‌ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం రెండేళ్ల ఉద్యాన డిప్లొమా కోర్సుల ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పదో తరగతి పాసై పాలీసెట్‌ అర్హత సాధించిన వారు ఈ డిప్లొమా కోర్సుల్లో చేరేందుకు అర్హులని వర్సిటీ వీసీ నీరజ ప్రభాకర్‌ చెప్పారు. ఈనెల 22 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఐదు పాలిటెక్నిక్‌ కళాశాలల్లో 200 సీట్లు ఉన్నాయి.

ప్రభుత్వ పాలిటెక్నిక్‌లు ఆదిలాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో ఉండగా, మరో మూడు ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలు నల్లగొండ జిల్లా (గ్రామభారతి ఉద్యాన పాలిటెక్నిక్‌ మర్రిగూడ), మహబూబాబాద్‌ జిల్లా (విశ్వవర్ధిని తొర్రూర్‌), సూర్యాపేట జిల్లా (గంట గోపాల్‌రెడ్డి కళాశాల)లో ఉన్నాయి. డిప్లొమా కోర్సు పూర్తి చేసిన వారు హార్టీసెట్‌ ప్రవేశపరీక్ష ద్వారా 15 శాతం మందికి ఉద్యాన బీఎస్సీ చేసేందుకు అవకాశం కల్పించనున్నారు.

మరిన్ని వార్తలు