పేద విద్యార్థులకు పెన్నిధి 

20 Feb, 2022 02:04 IST|Sakshi
కిచెన్‌ను పరిశీలిస్తున్న  మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌  

మహబూబ్‌నగర్‌ రూరల్‌: విద్యార్థులు, పేదలు, ఆస్పత్రుల్లో రోగుల సహా యకులకు హరే కృష్ణ మూవ్‌మెంట్‌ ద్వారా ఉచితంగా భోజనం అందించడం అభినందనీయమని ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. మహబూబ్‌ నగర్‌ మండలం కోడూర్‌లో అరబిందో ఫార్మా ఫౌండేషన్‌ సహకారంతో హరే కృష్ణ మూవ్‌మెంట్‌ చారిటబుల్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో 20 వేల భోజనాలు అందించే సామర్థ్యం కలిగిన సెంట్రలైజ్డ్‌ కిచెన్‌ను, మహబూబ్‌నగర్‌ నియోజ కవర్గంలోని 20 వేలమంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉదయం అల్పా హారం అందించే ‘స్వస్త్య ఆహార’ పథకాన్ని మంత్రి శనివారం ప్రారంభిం చారు. ఆయన మాట్లాడుతూ ఈ పథకం పేద విద్యార్థులకు పెన్నిధి లాంటిదని పేర్కొన్నారు. కార్యక్రమంలో అరబిందో ఫార్మా ఫౌండేషన్‌ డైరెక్టర్‌ మదన్మోహన్‌రెడ్డి, ఫౌండర్‌ సత్యగౌర చంద్రదాస్‌ ప్రభూజి, జెడ్పీ చైర్మన్‌ స్వర్ణసుధాకర్‌రెడ్డి, కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావ్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు