రామప్పపై త్వరలో నివేదిక

2 Oct, 2021 01:39 IST|Sakshi

కిషన్‌రెడ్డికి అంజేస్తాం: శ్రీనివాస్‌గౌడ్‌

సాక్షి, హైదరాబాద్‌: రామప్ప దేవాలయం అభివృద్ధికి సమగ్ర నివేదికను త్వరలోనే కేంద్ర పర్యాటక, సాంస్కృ తిక మంత్రి జి.కిషన్‌రెడ్డికి అందజేస్తామని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు వచ్చే జయంతి కల్లా ఆయన పుట్టిపెరిగిన ప్రదేశాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దుతామన్నారు. పీవీ ఖ్యాతి అందరికీ తెలియజేసేలా మ్యూజియం స్థాపిస్తామని చెప్పారు.

శుక్రవారం మండలిలో రామప్ప ఆలయం వద్ద పర్యాటక ప్రోత్సాహకంపై ఎమ్మెల్సీలు ఎమ్మెస్‌ ప్రభాకర్‌రావు, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి వేసిన ప్రశ్నకు సభ్యురాలు సురభి వాణీదేవి తొలిసారి కౌన్సిల్‌లో మాట్లాడారు. కాగా, హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై 8 ఇంటర్‌ఛేంజ్‌ పాయింట్ల వద్ద ట్రామాకేర్‌ సెంటర్లను నెలకొల్పినట్లు మంత్రి కేటీఆర్‌ తెలిపారు. పటాన్‌చెరువు, మేడ్చల్, శామీర్‌పేట, ఘట్‌కేసర్, పెద్దఅంబర్‌పేట్, బొంగులూరు, నార్సింగి, టీఎస్‌పీఏల వద్ద పలు సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలియజేశారు. 

మరిన్ని వార్తలు