శ్రీశైలం గేట్లు మూసివేత 

24 Aug, 2022 01:51 IST|Sakshi

గద్వాల రూరల్‌/దోమలపెంట (అచ్చంపేట): జూరాల, సుంకేసుల నుంచి వస్తున్న వరద తగ్గుముఖం పట్టడంతో మంగళవారం శ్రీశైలం ఆనకట్ట గేట్లను మూసివేశారు. ప్రస్తుతం జూరాల, సుంకేసుల నుంచి 1,43,233 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. ఎడమ గట్టు భూగర్భ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 31,784, ఏపీ జెన్‌కో పరిధిలోని కుడి గట్టు కేంద్రంలో విద్యుత్‌ కోసం 31,459.. మొత్తం 63,243 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

మరోవైపు జూరాలకు స్వల్పంగా ఇన్‌ఫ్లో పెరిగింది. మంగళవారం రాత్రి 7 గంటలకు జూరాలకు 1.20 లక్షల ఇన్‌ఫ్లో ఉండగా.. 24 గేట్లు ఎత్తి శ్రీశైలానికి 99,072 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. విద్యుదుత్పత్తి కోసం 22,436 క్యూసెక్కుల నీటిని వినియోగించుకుంటున్నారు.   

మరిన్ని వార్తలు