శ్రీశైలం ప్రమాదం: మృతుల చివరి సంభాషణ

23 Aug, 2020 18:13 IST|Sakshi

సాక్షి, నాగర్‌కర్నూల్ ‌: శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్‌ కేంద్రంలో సంభవించిన భారీ అగ్ని ప్రమాదంలో తొమ్మిది మంది సిబ్బంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అగ్ని ప్రమాదంపై సీఐడీ విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రమాదంలో మృతి చెందిన ఏఈలు సుందర్‌, మోహన్‌ల చివరి సంభాషణ వెలుగులోకి వచ్చింది. చనిపోయే ముందు మోహన్‌ అగ్ని ప్రమాదానికి సంబంధించిన భయానక దృశ్యాలను వీడియో తీశాడు. శనివారం మోహన్ ఫోన్‌కు ఛార్జింగ్‌ పెట్టిన అతడి భార్య అందులోని వీడియో దృశ్యాలు, సంభాషణలను చూసి కన్నీటి పర్యంతమైంది.  (నువ్వు, పిల్లలు జాగ్రత్త.. సుందర్‌ చివరి మాటలు)

మృతులు సుందర్‌, మోహన్‌ల మధ్య సంభాషణ 
సుందర్‌ : ఇక కష్టం! మన పని అయిపోయింది. ఆశలు వదులుకో.
మోహన్‌ : నైబై ఆశగా ఉండాలె. కొద్దిసేపు ఆలోచించుకుని పోదాం.
సుందర్‌ : ఇక మనం బతకం! పొగ మొత్తం అలుముకుంది.

అంతకు క్రితం సుందర్‌ తన భార్యతో జరిపిన ఫోన్‌ సంభాషణ సైతం వైరల్‌గా మారింది. ‘ నువ్వు, పిల్లలు జాగ్రత్త. 15 నిమిషాల్లో మమ్మల్ని కాపాడకపోతే బ్రతికే పరిస్థితి లేదు’ అన్న సుందర్‌ చివరి మాటలు పలువురిని కదిలించాయి.  కాగా, మోహన్‌ అనే మరో ఏఈ తోటి వారిని కాపాడటానికి సహకరించాడు. ఈ ఘటనలో 17 మంది విధుల్లో ఉండగా, ఎనిమిది మంది బయటపడ్డారు. మిగతా తొమ్మిది మంది ప్రమాదంలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు