ఎక్సైజ్‌ ఉద్యోగులకు ‘ఉగాది కానుక’ 

2 Apr, 2022 01:52 IST|Sakshi

నేడు పదోన్నతుల పత్రాలను అందజేయనున్న మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ 

సాక్షి, హైదరాబాద్‌: ఎక్సైజ్‌ శాఖలో పని చేస్తున్న అధికారులు, ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఉగాది కానుక ప్రకటించింది. రాష్ట్రంలో అన్ని శాఖల ఉద్యోగులకు పదోన్నతులు కల్పించిన తరహాలోనే ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖలో ఎస్‌ఐ నుంచి అదనపు కమిషనర్‌ స్థాయి అధికారుల పదోన్నతులతో పాటు పోస్టుల అప్‌గ్రెడేషన్‌కు సీఎం కేసీఆర్‌ ఆమోదం తెలిపారు. ఇందుకు అనుగుణంగా నేడు పదోన్నతుల పత్రాలను రాష్ట్ర ఎక్సైజ్‌ మంత్రి వి.శ్రీనివాస్‌ గౌడ్‌ అందజేస్తారని మంత్రి కార్యాలయ వర్గాలు శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించాయి.    

మరిన్ని వార్తలు