Amnesia Pub Case: ముందు చాలా జరిగింది.. డ్యామిట్‌ అతడే వల్లే ఇదంతా.. కీలక విషయాలు బట్టబయలు

14 Jun, 2022 19:11 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌లోని అమ్నేషియా పబ్‌ కేసులో పోలీసు కస్టడీ ముగిసింది. ప్రధాన నిందితుడు సాదుద్దీన్‌ మాలిక్‌తో పాటు మైనర్ల కస్టడీ నేటితో ముగిసింది. కాగా, కస్టడీలో పోలీసులు పలు విషయాలను రాబట్టారు. ఈ సందర్బంగా పోలీసులు.. ‘‘సామూహిక లైంగిక దాడి ఘటనలో నిందితుల్లో పశ్చాత్తాపం కనిపించలేదు. విచారణ సమయంలో నిందితులు జాలీగా ఉన్నారు. తప్పు చేయలేదన్న ఫీలింగ్‌లో ఉన్నారు. ఇక, వీడియో లీకేజీపై నిందితుల మధ్య గొడవ జరిగింది. వీడియో షూట్‌ చేసిన ఓ మైనర్‌పై మిగిలిన నిందితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

వీడియో బయటికి రాకపోయి ఉంటే.. కేసు ఉండదని నిందితులు ధీమా వ్యక్తం చేశారు. మైనర్‌కు కారు ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే కుమార్తెపై కేసు నమోదైంది. బెంజ్‌ కారు నడిపిన మైనర్‌ కుటుంబ సభ్యులపై కూడా కేసు నమోదు చేశాము. బెంజ్‌ కారును పోలీసులకు చిక్కకుండా కుటుంబ సభ్యులు ప్రయత్నాలు చేశారు. బెంజ్‌ కారు విషయంలో నిందితుల కుటుంబ సభ్యులు.. పోలీసులను తప్పుదోవపట్టించారు. వక్ఫ్‌బోర్డ్‌ చైర్మన్‌కు అధికారికంగా కారు కేటాయించలేదు. సొంత కారుపైనే వక్ఫ్‌బోర్డ్‌ చైర్మన్‌ గవర్నమెంట్‌ స్టిక్కర్‌ వేసుకున్నారు. ఇంటి నుంచి ఇన్నోవా కారును డ్రైవర్‌ తీసుకెళ్లాడు. కాన్సూ బేకరీ వద్ద డ్రైవర్‌ను దింపేసి కారును మైనర్లు తీసుకెళ్లారు. ఇన్నోవా కారు దొరక్కుండా ప్రయత్నాలు చేశారు. 

బాలిక గొంతుపై గాట్లు ఉండటంతో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదుకు ముందే బంజారా హిల్స్‌లోని ఆశ హాస్పిటల్‌లో మైనర్‌కు సైకియాట్రిస్ట్ ద్వారా కౌన్సిలింగ్ ఆమె పేరెంట్స్‌ కౌన్సిలింగ్‌ ఇప్పించారు. తమ కూతురుపై ఎవరో అఘాయిత్యానికి పాల్పడినట్లు అనుమానించి, బాలికను పబ్‌కు తీసుకువెళ్లిన హాదీని మైనర్ పేరెంట్స్‌ ప్రశ్నించారు. మైనర్‌ను పబ్‌కు తీసుకు వెళ్లింది ఎమ్మెల్యే బంధువు కుమారుడని చెప్పడంతో ఘటన బయటకు వచ్చింది. దీంతో, నిందితులు, ఎమ్మెల్యే తనయుడు బాలిక కుటుంబ సభ్యులను బెదిరించారు. ఇక, ఇన్నోవా కారులోనే మైనర్‌పై ఐదుగురు నిందితులు లైంగిక దాడి చేశారు అని వెల్లడించారు. 

మరిన్ని వార్తలు