Telangana: దీపావళి వేళ నర్సింగ్‌ విద్యార్థులకు శుభవార్త..!

4 Nov, 2021 04:52 IST|Sakshi

స్టైపెండ్‌ మూడింతలు

 బీఎస్సీ నర్సింగ్‌లకు రూ.8 వేల వరకు పెంపు

ఎంఎస్సీ నర్సింగ్‌ విద్యార్థులకు కొత్తగా స్టైపెండ్‌

సాక్షి, హైదరాబాద్‌: నర్సింగ్‌ విద్యార్థులకు శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం వారి ఇంట దీపావళి వెలుగులు నింపింది. ఆ విద్యార్థుల స్టైపెండ్‌ను మూడింతలకుపైగా పెంచింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. స్టైపెండ్‌ పెంపుదల వెంటనే అమలులోకి వస్తుందని పేర్కొన్నారు. ఈ పెంపుదల నర్సింగ్‌ స్కూళ్లు, నిమ్స్‌ల్లో చదువుతున్న జీఎన్‌ఎం, బీఎస్సీ (నర్సింగ్‌) విద్యార్థులకు వర్తిస్తుంది.

ఎంఎస్సీ (నర్సింగ్‌) విద్యార్థులకు కూడా స్టైపెండ్‌ విధానాన్ని తొలిసారిగా ప్రవేశపెట్టినట్లు వైద్య విద్యా సంచాలకుడు (డీఎంఈ) డాక్టర్‌ రమేశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఎంఎస్సీ(నర్సింగ్‌) మొదటి ఏడాది విద్యార్థులకు నెలకు రూ.9 వేలు, రెండో ఏడాది విద్యార్థులకు రూ.10 వేల స్టైపెండ్‌ అందజేస్తారు. 


 

మరిన్ని వార్తలు