జూబ్లీహిల్స్‌లో ఇళ్లపై పడ్డ పెద్ద బండరాయి

1 Aug, 2020 20:36 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్ : నగరం‌లో శనివారం భారీ వర్షం కురిసింది. వర్షం కారణంగా జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 45లో ఓ ప్రమాదం చోటుచేసుకుంది.  వర్షం ధాటికి పెద్ద పెద్ద రాళ్లు ఇళ్లపై పడటం తీవ్ర భయాందోళన కలిగించింది. స్థానికుల సమాచారం ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 44 ఓ కాంట్రాక్టర్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా 20 అడుగులు ఉన్న కొండను తవ్వాడు. ఈ క్రమంలోనే భారీ వర్షం సంభవించడంతో ఒక్కసారిగా పెద్ద బండలతో ఉన్న కొండ కూలి పక్కనే ఉన్న నాలుగు అంతస్థుల భవనంపై పడింది. ఇంట్లోని సామగ్రి ధ్వంసమవ్వగా.. నాలుగు అంతస్థుల భవనం పూర్తిగా దెబ్బతిన్నది. ఒక్కసారిగా పెద్దగా శబ్ధం రావడంతో భవనంలో ఉన్న వారంతా బయటకు పరుగులు తీశారు. భవనం బలంగా ఉండటంతో పెను ప్రమాదం తప్పిందని అక్కడున్న వారు వాపోతున్నారు. కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని.. బాధితులు జూబ్లీహిల్స్‌​ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

మరిన్ని వార్తలు