బిర్యానీ ఏదని అడిగాడని..

25 Jul, 2022 03:26 IST|Sakshi

హాస్టల్‌ పైనుంచి దూకిన విద్యార్థి

విరిగిన కాలు.. తప్పిన ప్రాణాపాయం 

అచ్చంపేట రూరల్‌: తన బిర్యానీ ప్యాకెట్‌ కని పించడం లేదంటూ ఒక విద్యార్థి అడిగినందుకు మరో విద్యార్థి వసతి గృహం టెర్రస్‌ పైనుంచి కిందికి దూకేయడంతో అతని కాలు విరిగింది. ఈ సంఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల వసతిగృహంలో ఆదివారం జరిగింది. అమ్రాబాద్‌ మండలం ఎలమపల్లికి చెందిన రామస్వామి, సువ ర్ణ దంపతుల కుమారుడు చారగొండ రాజేశ్‌ స్థానిక పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నా డు. ఆదివారం కావడంతో విద్యార్థులను చూ సేందుకు తల్లిదండ్రులు వచ్చారు.


చికిత్స పొందుతున్న విద్యార్థి రాజేశ్‌ 

అదే తరగ తికి చెందిన అరుణ్‌ అనే విద్యార్థి తల్లిదండ్రులు బిర్యానీ ప్యాకెట్‌ తీసుకు­వచ్చారు. మధ్యాహ్నం అరుణ్‌ బిర్యానీ తిని మిగిలింది రాత్రికి తినేందుకు బాక్సులో పెట్టుకు­న్నాడు. కొద్దిసేపటి తర్వాత వచ్చి చూడగా బిర్యానీ ప్యాకెట్‌ కనిపించకపోవడంతో తోటి స్నేహితులను అడిగాడు. ఈ క్రమంలో రాజేష్‌ను ప్రశ్నించగా.. అతనేమీ మాట్లాడకుండా వసతిగృహం టెర్రస్‌పైకి ఎక్కి దూకేశాడు. వెంటనే పాఠశాల సిబ్బంది రాజేశ్‌ను అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తర లించారు. ఎడమ కాలు విరిగిందనే అనుమా నంతో మహబూబ్‌నగర్‌లోని ఒక ప్రైవేట్‌ ఆస్పత్రికి రిఫర్‌ చేశారు. 

మరిన్ని వార్తలు