రోజూ 60 వేల మంది వీక్షణ

1 Aug, 2021 03:00 IST|Sakshi

‘టి సాట్‌’ ఇంజనీరింగ్‌ పాఠాలకు ఆదరణ

సాక్షి, హైదరాబాద్‌: ‘టి సాట్‌’ఇంజనీరింగ్‌ పాఠ్యాంశ ప్రసారాలపై విద్యార్థులు విపరీతంగా ఆసక్తి చూపిస్తున్నారు. జూలై 26న ప్రారంభమైన ఈ శిక్షణ కార్యక్రమాలు 15 రోజుల పాటు కొనసాగనున్నాయి. ప్రతీ రోజూ ఉదయం 8.15 నుంచి 10.30 వరకు ‘టి సాట్‌ యాప్, విద్య, నిపుణ చానళ్లు, టి సాట్‌ ఫేస్‌బుక్‌ పేజీ, యూ ట్యూబ్‌ చానళ్ల ద్వారా విద్యార్థులు వీక్షిస్తున్నారు. వివిధ మాధ్యమాల ద్వారా ఇప్పటి వరకు రోజూ సుమారు 60 వేల మంది ఇంజనీరింగ్‌ పాఠ్యాంశాలను వీక్షిస్తున్నట్లు ‘టి సాట్‌’లెక్కలు వేస్తోంది. ‘వెరీ లార్జ్‌స్కేల్‌ ఇంటిగ్రేషన్‌’(వీఎల్‌ఎస్‌ఐ) ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్స్‌ అనే అంశంపై ఇప్పటి వరకు 12 పాఠ్యాంశాలను ‘టి సాట్‌’ప్రసారం చేసింది. ఇంజనీరింగ్‌ విద్యార్థులకు తరగతి గదులు, ఆఫ్‌లైన్‌లో విద్యాబోధన జరుగుతున్నా తమ కెరీర్‌ నిర్మాణంలో అత్యం త కీలకమైన నైపుణ్యాలను విద్యార్థి దశలో సాధించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ శాఖకు అనుబంధంగా పనిచేస్తున్న ‘తెలంగాణ అకాడమీ ఆఫ్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌’ (టాస్క్‌) ఇతర సంస్థల భాగస్వామ్యంతో పాఠ్యాం శాలను రూపొందిస్తోంది. ఫొటోనిక్స్‌ వాలీ కార్పొరేషన్, వేద ఐఐటీ పాఠ్యాంశాల రూపకల్పనలో పా లుపంచుకుంటున్నాయి. పరిశ్రమల అవసరాలు, నైపుణ్యాల పెంపు, ఉద్యోగ అవకాశాలు, సంస్థాగత సాంకేతికత, ఇతర అంశాలపై ‘వీఎల్‌ఎస్‌ఐ’ప్రత్యేక్ష శిక్షణ కార్యక్రమాలు రూపొందుతున్నాయి. 

మరిన్ని వార్తలు