ట్రైనీ ఎస్‌ఐపై అత్యాచారయత్నం: ఎస్‌ఐ శ్రీనివాస్‌రెడ్డికి రిమాండ్‌ 

5 Aug, 2021 08:17 IST|Sakshi
ఎస్‌ఐ శ్రీనివాస్‌రెడ్డి 

పద్నాలుగు రోజుల రిమాండ్‌

మహబూబాబాద్‌ జైలుకు తరలింపు 

సాక్షి, మహబూబాబాద్‌: మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ట్రైనీ మహిళా ఎస్‌ఐపై అదే పీఎస్‌కు చెందిన ఎస్‌ఐ శ్రీనివాస్‌రెడ్డి లైంగికదాడికి యత్నించిన కేసులో అతన్ని అరెస్ట్‌ చేసి 14 రోజుల రిమాండ్‌ నిమిత్తం మహబూబాబాద్‌ సబ్‌ జైలుకు పంపినట్లు ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తెలిపారు. బుధవారం మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో మీడియాతో ఎస్పీ ఈ కేసు వివరాలు వెల్లడించారు.

బాధితురాలి ఫిర్యాదు మేరకు శ్రీనివాస్‌రెడ్డిపై ఎఫ్‌ఐఆర్‌ బుక్‌ చేసినట్లు తెలిపారు. విచారణ అధికారిగా తొర్రూరు డీఎస్పీ వెంకటరమణను నియమించామన్నారు. ఎస్‌ఐ శ్రీనివాస్‌రెడ్డిపై ఐపీసీ 354, 354ఏ, 354బి, 354డి, 376(2), 511 ఐపీసీతోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు వివరించారు. చట్టం దృష్టిలో అందరూ సమానమేనని, తప్పుచేసిన వారికి తప్పకుండా శిక్షపడుతుందన్నారు. కేసుకు సంబంధించి పూర్తి వివరాలను రాష్ట్ర పోలీస్‌ ఉన్నతాధికారులకు నివేదిక పంపించనున్నట్లు ఎస్పీ వివరించారు. జిల్లాలో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని అన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు