నీ న్యూడ్‌ వీడియో, ఫొటోలను బయట పెడతా.. సీఐ వేధింపులు

25 Sep, 2022 19:09 IST|Sakshi

సాక్షి, వరంగల్‌: వరంగల్‌లో ఓ సీఐ వేధింపుల వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. తన న్యూడ్‌ వీడియోలు, ఫొటోస్‌తో సీఐ వేధింపులకు గురిచేస్తున్నారని ఓ మహిళ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టి సుబేదారి ఉమెన్‌ పీఎస్‌లో పనిచేస్తున్న సీఐ సతీష్‌కుమార్‌ను సస్పెండ్‌ చేశారు. వివిధ కేసుల్లో ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళలను సీఐ డబ్బులు కోసం వేధింపులకు గురిచేస్తున్నట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి.

తన భర్త కొంతమంది మహిళల న్యూడ్‌ వీడియోలు తీసి వేధిస్తున్నాడని సుబేదారి ఉమెన్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళ నుంచి కేసు నమోదు చేయడానికి రూ.50వేల లంచం తీసుకున్నట్లు సీఐపై ఆరోపణలు వచ్చాయి. సీఐ వ్యవహారాలపై విచారణ చేపట్టిన సీపీ తరుణ్‌ జోషి.. సతీష్‌ను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సీఐపై అవినీతి ఆరోపణలతో పాటు, లైంగిక వేధింపుల ఆరోపణలు స్థానికంగా కలకలం సృష్టిస్తున్నాయి. 

చదవండి: (ఉప్పల్‌ స్టేడియానికి క్రీడామంత్రి.. వారందరికీ ఉచితంగా మ్యాచ్‌ చూసే అవకాశం)

>
మరిన్ని వార్తలు