కులదురహంకార హత్యల్ని నిరోధించాలి

9 May, 2022 00:53 IST|Sakshi

సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు సుభాషిణి అలీ 

నాగరాజు కుటుంబాన్ని ఆదుకోవాలి  

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో కుల దురహంకార హత్యల నిరోధానికి ప్రత్యేక చట్టం రూపొందించాలని సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యురాలు సుభాషిణి అలీ డిమాండ్‌ చేశారు. తమ పార్టీ 15 ఏళ్ల క్రితమే అందుకు సంబంధించిన ముసాయిదా బిల్లును నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వానికి సమర్పించిందని గుర్తు చేశారు. బాధితులకు షెల్టర్, పరిహారం, కులాంతర, మతాంతర వివాహాలు చేసుకున్నవారికి రక్షణ తదితర అంశాలు ఆ బిల్లులో పొందుపరిచామన్నారు.

నాటి కాంగ్రెస్‌తోపాటు నేటి బీజేపీ ప్రభుత్వానికీ ఆ చట్టం రావటం ఇష్టం లేదని, అందుకే రెండు పార్టీలు మౌనంగా ఉంటున్నాయని ఆమె విమర్శిం చారు. హైదరాబాద్‌ ఎంబీ భవన్‌లో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డీజీ నర్సింహారావు, కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్‌ బాబుతో కలిసి సుభాషిణి అలీ విలేకరులతో మాట్లాడారు. నాగరాజు కుటుంబానికీ, ఆశ్రిన్‌కు కలిపి రూ.75లక్షల పరిహారం, అమ్మాయికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఆమె డిమాండ్‌  చేశారు.  

మరిన్ని వార్తలు